ప్రతి క్షణం ప్రమాదం | Nayanthara Movie Connect To Release On Dec 22 2022 | Sakshi
Sakshi News home page

ప్రతి క్షణం ప్రమాదం

Dec 10 2022 3:04 AM | Updated on Dec 10 2022 3:04 AM

Nayanthara Movie Connect To Release On Dec 22 2022 - Sakshi

సత్యరాజ్, నయనతార, అనుపమ్‌ ఖేర్‌ 

నయనతార లీడ్‌ రోల్‌లో అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కనెక్ట్‌’. సత్యరాజ్, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రధారులు. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ‘కనెక్ట్‌’ తెలుగు వెర్షన్‌ను యూవీ క్రియేషన్స్‌ రిలీజ్‌ చేస్తోంది.

తెలుగు ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ షేర్‌ చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించడానికి 24 గంటల ముందు అంటూ ట్రైలర్‌ సాగుతుంది.‘నాన్నా నేను చెప్పేది విను.’, ‘నీతో ఉన్నది మన అమ్ము కాదు.. అక్కడ ఉన్న ప్రతిక్షణం నీ ప్రాణానికి ప్రమాదం’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement