డిప్రెషన్‌కు వాడే టాబ్లెట్ పేరేంటి?.. నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్! | Naveen Polishetty Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Naveen Polishetty: 'టీమిండియా ఓటమిని మర్చిపోలేకపోతున్నా'..నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్!

Nov 21 2023 12:47 PM | Updated on Nov 21 2023 1:17 PM

Naveen Polishetty Video Goes Viral On Social Media - Sakshi

ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అభిమానులను అలరించిన హీరో నవీన్ పొలిశెట్టి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ','జాతి రత్నాలు' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం 'జాతి రత్నాలు' డైరెక్టర్‌తోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

 వీడియోలో నవీన్ మాట్లాడుతూ..' అరే వంశీ.. అదేదో డిప్రెషన్ కోసం ఏదో టాబ్లెట్ ఉందన్నావ్ కదరా.. ఆ టాబ్లెట్ పేరేంట్రా?.. ఒక ఫ్రెండ్‌ కోసం అడుగుతున్నారా? నాకోసం నేనేందుకు అడుగుతారా?.. ఇప్పుడు నా లైఫ్‌లో జాయ్‌ఫుల్‌ ఫేజ్‌లో ఉన్నా.. డోలో 650 నా.. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివావా? లేక పేమేంట్ సీటా? అని అన్నారు. అయితే ఈ వీడియోకు వరల్డ్ కప్ ఫైనల్-2023 అంటూ ట్యాగ్ చేశారు. అయితే మ్యాచ్‌లో ఇండియా ఓటమిని ఇంకా మర్చిపోలేక ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement