తీరు మారని బాలయ్య.. బర్త్ డే రోజు కూడా అదే పని | Nandamuri Balakrishna Fire On fans at Photo session event on birthday | Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: తీరు మారని బాలయ్య.. పుట్టినరోజు పూనకాలేనా?

Jun 11 2026 4:36 PM | Updated on Jun 11 2026 4:41 PM

Nandamuri Balakrishna Fire On fans at Photo session event on birthday

సందర్భం ఏదైనా సరే తన తీరు ఇంతే అనే హీరోల్లో బాలయ్య ముందుంటారు. గతంలో చాలాసార్లు తన కోపంతో ఎంతోమంది అభిమానులపై చేయి చేసుకున్నారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తన చూపించారు. బాలయ్య బర్త్‌ డే వేడుకలకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో ఫొటో సెషన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ అభిమానులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ బాలయ్య ఇక మారడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement