'తండేల్' టీజర్ లాంటి వీడియో.. 2 నిమిషాల్లో కథేంటో చెప్పేశారుగా! | Naga Chaitanya, Sai Pallavi's Thandel Movie Teaser Video | Sakshi
Sakshi News home page

Thandel Teaser: జాలారిగా చైతూ.. ఆ విషయంలో అదరగొట్టేశాడంతే!

Jan 6 2024 11:44 AM | Updated on Jan 6 2024 11:59 AM

Naga Chaitanya Sai Pallvi Thandel Movie Teaser Video - Sakshi

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య అదరగొట్టేశాడు. 'తండేల్' సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడీ అక్కినేని హీరో. 'ఎసెన్స్ ఆఫ్ తండేల్' పేరుతో తాజాగా ఓ స్పెషల్ వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. చెప్పాలంటే శుక్రవారం సాయంత్రమే విడుదల చేయాల్సింది కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల శనివారం ఉదయం రిలీజ్ చేశారు. అయితే టీజర్ లాంటి ఈ వీడియో ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం)

గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వాళ్లని కొన్నేళ్ల పాటు పాక్ ప్రభుత్వం జైల్లో నిర్భంధించి చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొస్తాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో 'తండేల్' సినిమా తీస్తున్నారు. జాలారి పాత్రలో చైతూ నటిస్తుండగా, అతడి భార్యగా సాయిపల్లవి నటిస్తోంది.

బోటుపై చేపల వేటకు వెళ్తున్న హీరో.. 'దద్దా గుర్తెట్టుకో.. ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్.. ఇక రాజులమ్మ జాతరే' చెప్పే ఓ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతడు పాక్ ప్రభుత్వానికి చిక్కడం, అక్కడ జైల్లో ఇబ్బంది పెడుతున్న అధికారికి కౌంటర్ ఇవ్వడం లాంటి సీన్స్ చూపించారు. చివర్లో సాయిపల్లవిని అలా చూపించి టీజర్‌ని ముగించారు. అయితే కథేంటనేది.. ఈ వీడియోలో చూచాయిగా చెప్పేశారు. చైతూ మాట్లాడిన శ్రీకాకుళం యాస కూడా బాగుంది. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో 'తండేల్'తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement