సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Hansika My Name Is Shruthi Movie Released In OTT, Check Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

My Name Is Shruthi In OTT: హన్సిక కొత్త మూవీ ఓటీటీ రిలీజ్.. అందులో స్ట్రీమింగ్!

Published Fri, Dec 29 2023 7:10 AM

My Name Is Shruthi Movie OTT Streaming In Amazon Prime Hansika - Sakshi

శుక్రవారమైతే చాలు ఓటీటీల్లోకి బోలెడన్ని మూవీస్ వచ్చేస్తుంటాయి. భారతీయ భాషా చిత్రాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ప్రతివారం వీటి కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ తెలుగు థ్రిల్లర్.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: హీరోగా పల్లవి ప్రశాంత్‌.. లీక్‌ చేసిన సింగర్‌ భోలె)

హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. 'దేశముదురు' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. దీంతో తమిళంలో వరస మూవీస్ చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత 'మై నేమ్ ఈజ్ శృతి' అనే తెలుగు సినిమా చేయగా, నవంబరు 17న ఇది థియేటర్లలో రిలీజైంది. 

అయితే హన్సిక ఫెర్ఫార్మెన్స్ బాగుందని పేరొచ్చినప్పటికీ.. సినిమా సరిగా ఆడలేదు. ఇప్పుడు దాదాపు నెలన్నర తర్వాత సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓ యాడ్ ఏజెన్సీలో ప‌నిచేసే శృతి(హన్సిక).. స్కిన్ మాఫియా వ‌ల‌లో ఎలా ప‌డింది? ఆ మాఫియాను ఎదుర్కొని ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించింద‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ వీకెండ్ ఏదైనా థ్రిల్లర్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేసేయండి.

(ఇదీ చదవండి: విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement