ఫేక్‌ అరెస్ట్‌ వీడియో.. నటిపై క్రిమినల్‌ కేసు నమోదు | Sakshi
Sakshi News home page

ఫేక్‌ అరెస్ట్‌ వీడియో.. నటిపై క్రిమినల్‌ కేసు నమోదు

Published Sat, Nov 4 2023 2:11 PM

Mumbai Police Book Case On Urfi Javed Over Fake Arrest Video - Sakshi

ఉర్ఫీ జావెద్‌ గురించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. విచిత్రమైన డ్రెస్సులు ధరించి.. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తు అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఉన్న వింత ఫ్యాషన్‌ పిచ్చి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటుంది. కొన్నిసార్లు అయితే ఆమె షేర్‌ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారి తీస్తాయి.

ఈ మధ్యే ఆమె భూల్‌ భులయ్యలోని ఛోటా పండిత్‌ పాత్ర గెటప్‌లో ఫోటో షూట్‌ చేసి.. వాటిని నెట్టింట్లో పెట్టగా..ఓ వర్గం బెదిరింపులకు దిగింది. ఆ ఫోటోలు డిలీట్‌ చేయకపోతే చంపేస్తామని సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ.. ఉర్ఫీ మాత్రం వాటిని తొలగించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉర్ఫీ షేర్‌ చేసిన ఓ వీడియా కారణంగా..ఆమెపై కేసు నమోదైంది. 

ఏం జరిగింది?
తనను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నట్లు ఉర్ఫీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్‌ చేసింది. అందులో ఓ కేఫ్‌ వద్ద ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నట్లు ఉంది. నన్నుందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘చిన్న చిన్న దుస్తులు ధరించి ఎవరైనా తిరుగుతారా? అంటూ పోలీసులు ఫైర్‌ అవుతున్నారు. కాసేపు వాదనలు జరిగాక.. ఉర్ఫీ వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్‌ అయింది. ‘చిన్న దుస్తులు ధరిస్తే అరెస్ట్‌ చేస్తారా’ అని నెటిజన్స్‌ ముంబై పోలీసులను ట్రోల్‌ చేశారు.

ఫేక్‌ వీడియో.. కేసు నమోదు
అయితే ఉర్ఫీని అరెస్ట్‌ చేసినట్లు వచ్చిన వీడియో ఫేక్‌ది. ప్రచారం కోసం ఉర్ఫీనే ఆ వీడియో రెడీ చేయించుకుంది. ముంబై పోలీసులు స్పందించేవరకు ఆ విషయం బయటకు రాలేదు. వీడియో వైరల్‌ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్ట్‌ చేసింది నకిలీ పోలీసులని విచారణలో తేలింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు

 
Advertisement
 
Advertisement