రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్ | Mrunal Thakur Comments On Romance And Other Things | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: రొమాన్స్ గురించి మృణాల్ మాటల్లో.. ఏం చెప్పిందంటే?

Jul 1 2024 12:22 PM | Updated on Jul 1 2024 12:29 PM

Mrunal Thakur Comments On Romance And Other Things

'సీతారామం' పేరు చెప్పగానే గుర్తొచ్చేది మృణాల్ ఠాకురే. ఎందుకంటే అప్పటివరకు హిందీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె..  ఈ ఒక్క మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ఆ తర్వాత 'హాయ్ నాన్న'తో మరో హిట్ అందుకుంది. 'ఫ్యామిలీ స్టార్' మాత్రం ఈమెకు దెబ్బేసింది. దీంతో కొత్త మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రీసెంట్‌గా 'కల్కి'లో అతిథి పాత్ర పోషించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాన్స్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)

'నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. మనకు నచ్చిన వాళ్లు మనతో నిజాయతీగా ఉండటం, మనపట్ల శ్రద్ధ చూపించడం, మన కోసం చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండటం గొప్ప రొమాంటిక్ చర్య అనేది నా ఉద్దేశం. చిన్న టచ్ చాలు' అని ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె హిందీలో ఓ మూవీ చేస్తోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో. మరోవైపు పలువురు తెలుగు దర్శకనిర్మాతలు కూడా ఈమెని అప్రోచ్ అవుతున్నప్పటికీ.. హిందీపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే తెలుగులో ఇప్పటప్పట్లో మరో మూవీ చేయడం కష్టమే.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష‍్మీ)

Advertisement
 
Advertisement
Advertisement