కథ చెప్పే విధానం ముఖ్యం | Mem Famous Producers Anurag Reddy, Sarath and Chandru Manoharan Interview | Sakshi
Sakshi News home page

కథ చెప్పే విధానం ముఖ్యం

May 21 2023 4:24 AM | Updated on May 21 2023 4:24 AM

Mem Famous Producers Anurag Reddy, Sarath and Chandru Manoharan Interview - Sakshi

‘‘ఏ సినిమాకైనా కథ కంటే ఆ కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిగారు బెస్ట్‌. మా ‘మేమ్‌ ఫేమస్‌’ కథని సుమంత్‌ ప్రభాస్‌ చక్కగా చెప్పారు. యూత్‌తో పాటు తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌ అన్నారు. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మేమ్‌ ఫేమస్‌’లో లీడ్‌ రోల్‌ కోసం ఆడిషన్స్‌ చేశాం. అయితే ఆ పాత్రకి ఎవరూ సరిపోకపోవడంతో చివరికి సుమంత్‌ ప్రభాసే నటించాడు. తన ప్రతిభ, ఎనర్జీ చూస్తే భవిష్యత్‌లో తప్పకుండా పెద్ద స్టార్‌ అవుతాడనిపిస్తోంది. ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని సెన్సిబిలిటీస్, ‘జాతిరత్నాలు’ మూవీలోని వినోదం కలిస్తే మా ‘మేమ్‌ ఫేమస్‌’. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ యంగ్‌ స్టార్‌ హీరోతో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement