breaking news
Anurag Reddy
-
మహేశ్ మాటలు సంతోషాన్నిచ్చాయి
‘‘మహేశ్‌బాబుగారు ‘మేమ్ ఫేమస్’ సినిమా చూసి గొప్పగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ మూవీ విడుదల కాకముందే సుమంత్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని మహేశ్‌గారు ముందుకు రావడం మజా అనిపించింది.. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు నిర్మాత అనురాగ్ రెడ్డి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా గురించి మహేశ్ బాబుగారి ట్వీట్ చదువుతున్నపుడు నమ్మలేకపోయాను. నా తర్వాతి సినిమాని అనురాగ్, శరత్గార్లతో కలసి మహేశ్‌గారు నిర్మిస్తామని చెప్పడం అద్భుతం అనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. కొత్తవారితో చేసిన సినిమాకి ఇంత మంచి రెస్పా¯Œ ్స రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు శరత్ చంద్ర. ‘‘మహేశ్ బాబుగారి మాటలు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి’’ అన్నారు చంద్రు మనోహరన్. -
కథ చెప్పే విధానం ముఖ్యం
‘‘ఏ సినిమాకైనా కథ కంటే ఆ కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిగారు బెస్ట్. మా ‘మేమ్ ఫేమస్’ కథని సుమంత్ ప్రభాస్ చక్కగా చెప్పారు. యూత్‌తో పాటు తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ అన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మేమ్ ఫేమస్’లో లీడ్ రోల్ కోసం ఆడిషన్స్ చేశాం. అయితే ఆ పాత్రకి ఎవరూ సరిపోకపోవడంతో చివరికి సుమంత్ ప్రభాసే నటించాడు. తన ప్రతిభ, ఎనర్జీ చూస్తే భవిష్యత్‌లో తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడనిపిస్తోంది. ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని సెన్సిబిలిటీస్, ‘జాతిరత్నాలు’ మూవీలోని వినోదం కలిస్తే మా ‘మేమ్ ఫేమస్’. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ యంగ్ స్టార్ హీరోతో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఆసక్తితో దరి చేరిన లక్ష్యం
సక్సెస్ స్టోరీ ‘మేనేజ్మెంట్లో ఉన్నత విద్యనభ్యసించాలనే ఆసక్తి.. భవిష్యత్తులో సొంత ఎంటర్ప్రైజ్ స్థాపించాలనే ఆశయం.. సామాజిక అభివృద్ధికి చేయూతనందించాలనే తపన..’ ఈ మూడు అంశాలే తన విజయానికి ప్రధాన సాధనాలుగా నిలిచాయి అని అంటున్నాడు.. క్యాట్-2014లో 100 పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థి, నల్గొండకు చెందిన పి. అనురాగ్ రెడ్డి. చిన్నతనం నుంచే చదువులో మేటిగా రాణిస్తూ.. ప్రస్తుతం ఐఐటీ - ముంబైలో బీటెక్ (ఎలక్ట్రికల్) ఫైనల్ ఇయర్ చదువుతున్న అనురాగ్ రెడ్డి ఈ నెల 27న విడుదలైన క్యాట్-2014 ఫలితాల్లో వంద పర్సంటైల్ సాధించిన 16 మందిలో ఒకడిగా నిలిచాడు. ఆసక్తి, స్పష్టత ఉంటే లక్ష్యం ఏదైనా విజయం సులభంగా సాధించొచ్చు అంటున్నఅనురాగ్ రెడ్డి సక్సెస్ స్పీక్స్ ఆయన మాటల్లోనే.. లక్ష్య సాధనకు తోడ్పడిన సహకారం క్యాట్ లక్ష్యాన్ని సాధించడంలో అమ్మ రత్నమాల, మామయ్య అమరేందర్‌రెడ్డి అందించిన సహకారం ఎంతో తోడ్పడింది. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మ జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ చదివించింది. కుటుంబ ఆర్థిక సమస్యలు చదువుపై ప్రభావం చూపకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దీంతో చిన్నప్పటి నుంచీ అన్ని తరగతుల్లో ముందంజలో నిలవగలిగాను. మ్యాథ్స్ అంటే ఇష్టమే సులభం చేసింది క్యాట్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే ఉన్న ఇష్టమే క్యాట్ విజయాన్ని సులభం చేసింది. దీంతో క్యాట్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగం కోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేయలేదు. ఇంగ్లిష్‌కు కూడా ప్రత్యేకంగా ప్రిపరేషన్ అంటూ ఏమీ లేదు. అయితే క్రమం తప్పకుండా ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, వొకాబ్యులరీ డెవలప్ చేసుకోవడం వంటివి చేశాను. పూర్తి స్థాయిలో మూడు నెలలు బీటెక్‌లో ఇది ఎంతో కీలక సమయం. ఒకవైపు ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్, మరోవైపు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ హడావుడి, ఇంకోవైపు ఫైనల్ సెమిస్టర్ ప్రిపరేషన్.. దీంతో క్యాట్ కోసం పూర్తిస్థాయిలో సమయం కేటాయించింది మూడు నెలలు మాత్రమే. గత ప్రశ్నపత్రాలను సాల్వ్ చేయడం, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం వంటివి కలిసొచ్చాయి. ఇంగ్లిష్ కోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ పుస్తకాన్ని చదివాను. అన్ని నేపథ్యాలకీ అనుకూలంగా ఇక.. క్యాట్ విషయానికొస్తే.. కేవలం ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికే అనుకూలం అనే మాట వాస్తవం కాదు. అదే విధంగా ఆన్లైన్ టెస్ట్ స్లాట్లకు సంబంధించి క్యాట్ ప్రశ్నల క్లిష్టతపైనా కొందరిలో అపోహలున్నాయి. ఇవి కూడా నిజం కాదు. నేను నవంబర్ 16న సెకండ్ స్లాట్‌లో క్యాట్‌కు హాజరయ్యాను. ఈ స్లాట్‌లో అడిగిన ప్రశ్నలు మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌లో బేసిక్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులెవరైనా.. వారి అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా సులభంగా సమాధానాలు ఇచ్చే విధంగానే ఉన్నాయి. అంతేకాకుండా గత పదేళ్ల ప్రశ్నపత్రాలను కూడా ప్రాక్టీస్ చేశాను. వీటిని పరిశీలించినా కూడా అకడమిక్‌గా అన్ని నేపథ్యాల విద్యార్థులకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి అకడమిక్ నేపథ్యం, ఆన్లైన్ స్లాట్లు-ప్రశ్నల క్లిష్టత శైలిపై భయాలు వీడాలి. ఇంజనీరింగ్ టు మేనేజ్మెంట్ కారణం చిన్నప్పటి నుంచి ఎకనామిక్స్ సంబంధిత అంశాలంటే ఆసక్తి ఉండేది. వాటికి సంబంధించిన నైపుణ్యం సాధించాలనే భావన కూడా ఉండేది. కానీ.. అప్పట్లో భవిష్యత్తు కోణంలో ఇంజనీరింగ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఐఐటీ లక్ష్యంగా ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. ఈ క్రమంలో ఐఐటీ-జేఈఈలో ర్యాంకుతో ముంబైలో సీటు సాధించగలిగాను. ముంబైలో బీటెక్ కరిక్యులంలో తప్పనిసరిగా కొన్ని హ్యుమానిటీస్ కోర్సులు చదవాల్సి ఉంటుంది. నేను ఎకనామిక్స్ కోర్సులు చదివాను. దీంతోపాటు ఇంజనీరింగ్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి.. కొద్ది రోజుల ఉద్యోగ అనుభవం ఆధారంగా భవిష్యత్తులో సొంతంగా స్టార్టప్ నెలకొల్పాలనే ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఐఐఎంలను మార్గంగా ఎంచుకుని క్యాట్‌లో విజయం లక్ష్యంగా కదిలాను. అందుకే.. ఇటీవల జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి జాబ్ ఆఫర్ వచ్చినా వద్దనుకున్నాను. అహ్మదాబాద్‌కు తొలి ప్రాధాన్యం క్యాట్- 2014 విజయం ఆధారంగా ఐఐఎం-అహ్మదాబాద్‌కు తొలి ప్రాధాన్యమిస్తాను. ఇందుకోసం నిర్వహించే గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూపై దృష్టి పెడుతున్నాను. ఇటీవల ముగిసిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో విజయం కోణంలో గ్రూప్ డిస్కషన్ విషయంలో కొంత అనుభవం లభించింది. దానికి నగిషీలు దిద్దుకోవాలి. మరో వారం రోజుల్లో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అవి పూర్తి కాగానే జీడీ/పీఐ కోసం పూర్తి స్థాయి సమయం కేటాయిస్తాను. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటూ.. కనీసం ఏడాది ముందు క్యాట్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. ఆ తర్వాత ఆయా అంశాల కాన్సెప్ట్స్‌ను అర్థం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకోసం కనీసం ఒక ఏడాది ముందు నుంచే ఉద్యుక్తులవ్వాలి. అప్పుడే సత్ఫలితాలు ఆశించొచ్చు. కచ్చితంగా క్యాట్ ప్రిపరేషన్ కోసం ప్రతి రోజు కనీసం రెండు గంటల సమయం కేటాయించే విధంగా తమ టైం టేబుల్ రూపొందించుకోవాలి. దీంతోపాటు కేవలం చదవడానికే పరిమితం కాకుండా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా క్యాట్ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించే వేగం-కచ్చితత్వం పరంగా నైపుణ్యం లభిస్తుంది. వీటికి అదనంగా గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రిపరేషన్ స్థాయి, మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత పొందొచ్చు. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలు, ప్యాసేజ్‌లు అన్నీ సామాజిక అంశాల నేపథ్యంలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇంగ్లిష్ అంటే ఆ విభాగంలో మాస్టర్స్ కావాలనే భావన వీడాలి. న్యూస్ పేపర్ రీడింగ్, డిక్షనరీ రీడింగ్‌తో ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకుంటే క్యాట్‌లో ఎదురయ్యే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు ఇవ్వొచ్చు. పి. అనురాగ్ రెడ్డి అకడమిక్ ప్రొఫైల్ :- ⇒ పదోతరగతి (2009)లో 554 మార్కులు ⇒ ఇంటర్మీడియెట్ (2011)లో 951 మార్కులు ⇒ ఐఐటీ-జేఈఈ 2011లో 97వ ర్యాంకు ⇒ ఏఐఈఈఈ-2011లో 64వ ర్యాంకు ⇒ ఎంసెట్-2011లో 37వ ర్యాంకు ⇒ ఐశాట్-2011లో పదో ర్యాంకు