అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి | Meera Mitun Again Interesting Comments On Trisha Krishnan - Sakshi
Sakshi News home page

Trisha And Meera Mithun: అతను అసభ్యంగా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి

Aug 30 2023 12:45 PM | Updated on Aug 30 2023 1:01 PM

Meera Mithun Again Viral Comments On Trisha - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో హీరోయిన్ త్రిష బిజీగా ఉన్నారు.  40 ఏళ్ల వయసు దాటినా తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌-2'తో మరోసారి తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌ సినిమాకు ఆమె ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాకుండా  మెగాస్టార్‌ చిరంజీవితో కూడా మరోసారి కనిపించనుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో అజిత్‌ సినిమాతో పాటు సౌత్‌ ఇండస్ట్రీ నుంచి అరడజనుకు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే త్రిష గురించి ప్రముఖ తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేం మీరా మీథున్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

త్రిష గురించి మీరా మీథున్‌ కామెంట్స్‌
కోలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా మిథున్‌.. హీరోయిన్‌ త్రిష గురించి ఇలా చెప్పింది. 'త్రిష నటిస్తున్న ఓ సినిమాలో నేను కూడా చిన్న పాత్రలో నటించాను.. అప్పుడు సెట్‌లో ఓ ప్రముఖ నటుడు త్రిషను తాకకూడని చోట పదేపదే టచ్‌ చేశాడు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ సందర్భంలో త్రిష కూడా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఇలాంటి చర్య త్రిషకి కూడా ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ కోపం వచ్చి అరుస్తే సినిమా అవకాశం పోతుందని మౌనం వహించింది. ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోయిన్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. నాలాంటి సాధారణ నటీమణుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.' అని మీరా తెలిపింది.

(ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్‌ హీరోయిన్‌)

మీరా మిథున్ ఇదివరకే నటి త్రిషపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. త్రిషకు కుల పిచ్చి ఉందని దాంతో చాలా సినిమా అవకాశాలు కోల్పోయానని మీరా ఫైర్‌ అయింది.  మళ్లీ ఇప్పుడు త్రిష గురించి ఇలాంటి కామెంట్లు చేయడంతో కోలీవుడ్‌లో వైరల్‌ అవుతున్నాయి. త్రిషను టచ్‌ చేసిన ఆ ప్రముఖ నటుడి పేరును ఆమె రివీల్‌ చేయలేదు. మరీ ఆమె చేసిన వ్యాఖ్యల్లో నిజం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement