
నరేష్ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ 'మరొక్కసారి'. బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మాత. నితిన్ లింగుట్ల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
'మరొక్కసారి' మూవీకి భరత్ మాంచిరాజు సంగీతాన్ని అందించారు. అందమైన ప్రేమకథా చిత్రానికి విజువల్స్ మరింత అందాన్ని తీసుకురాబోతోన్నాయి. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. 5,430 మీటర్ల ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ నదిలో షూటింగ్ చేసిన ఏకైక, మొట్టమొదటి భారతీయ సినిమాగా 'మరొక్కసారి' నిలిచింది.