ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది | Marco Movie Telugu Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

Dec 28 2024 4:04 PM | Updated on Dec 28 2024 4:17 PM

Marco Movie Telugu Official Trailer Out Now

ఉన్ని ముకుందన్‌ హీరోగా నటించిన చిత్రం 'మార్కో'. హనీఫ్‌ అదేని దర్శకత్వం వహించిన  ఈ మూవీ నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. డిసెంబర్‌ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ. 85 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

'వయొలెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ  చిత్రం జనవరి 1న తెలుగులో విడుదల కానుంది. మార్కో సినిమా తెలుగు హక్కులు ఏకంగా రూ.3 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. టైటిల్‌ రోల్‌లో ఉన్ని ముకుందన్‌ అద్భుతంగా నటించారు. అతను మలయాళ నటుడే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడే కావడం విశేషం. టాలీవుడ్‌లో జనతా గ్యారేజ్, భాగమతి, యశోదా వంటి చిత్రాల్లో నటించారు. భాగమతిలో అనుష్కకు జోడీగా ఆయన నటించిన విషయం తెలిసిందే. 

ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ అంటూ మార్కోపై పలు కథనాలు కూడా వచ్చాయి. యానిమల్, కిల్‌ వంటి చిత్రాలను మించిన వైలెంట్ ఇందులో ఉందంటూ పలువురు నెటిజన్లు కూడా పేర్కొన్నారు. అందువల్ల మార్కో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. షరీఫ్‌ ముహమ్మద్‌ నిర్మించిన  ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్‌ దుహన్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారులుగా మెప్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement