హిందీ 'బిగ్‌బాస్‌'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ | Mannara Chopra Comments Director AS Ravi Kumar Kiss Bigg Boss 17 | Sakshi
Sakshi News home page

Mannara Chopra Bigg Boss: అది మీరనుకునే ముద్దు కాదు.. అసలు సంగతి చెప్పిన హాట్ బ్యూటీ

Oct 16 2023 7:17 PM | Updated on Oct 18 2023 1:18 PM

Mannara Chopra Comments Director AS Ravi Kumar Kiss Bigg Boss 17 - Sakshi

ప్రస్తుతం ఏ భాషలో చూసినా సరే 'బిగ్‌బాస్' షోనే నడుస్తోంది. తెలుగు, తమిళంలో 7వ సీజన్.. కన్నడలో 10వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా హిందీలో 17వ సీజన్ మొదలైంది. అయితే హిందీ షోలో మన తెలుగు హీరోయిన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంటరైంది. స్టేజీపై ఓ తెలుగు దర్శకుడు ముద్దు పెట్టిన విషయం గురించి మాట్లాడింది. ఇంతకీ అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

ప్రియాంక చోప్రా, పరిణితీ చోప్రాలకు బంధువైన మన్నారా చోప్రా.. తెలుగులోకి 'ప్రేమ గీమా జాన్తా నై' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత జక్కన్న, తిక్క, రోగ్, సీత చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయింది. ఈ మధ్య రాజ్ తరుణ్ 'తిరగబడరా సామి' సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. కొన్నిరోజుల ముందు జరిగిన ఈ మూవీ ఈవెంట్‌లో దర్శకుడు ఏఎస్ రవికుమార్.. పబ్లిక్‌లో మన్నారా బుగ్గపై ముద్దుపెట్టేశాడు.

అప్పట్లో అందరూ ఈ సంఘటన గురించి తెగ మాట్లాడుకున్నారు. తాజాగా హిందీ 'బిగ్‌బాస్ 17'లో ఈమె కంటెస్టెంట్‌గా ఇచ్చింది. స్టేజీపై రాగానే ఈమె వెల్కమ్ చెప్పిన సల్మాన్.. ఆ ముద్దు గురించి అడిగాడు. దీనికి బదులిచ్చిన మన్నారా.. అది మీరనుకునే ముద్దు కాదని, ప్రేమపూర్వకంగా ఆయన తనకు పెక్ తరహా ముద్దు పెట్టారని చెప్పింది. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement