breaking news
As ravikumar chaudhary
-
హిందీ 'బిగ్‌బాస్'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ
ప్రస్తుతం ఏ భాషలో చూసినా సరే 'బిగ్‌బాస్' షోనే నడుస్తోంది. తెలుగు, తమిళంలో 7వ సీజన్.. కన్నడలో 10వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా హిందీలో 17వ సీజన్ మొదలైంది. అయితే హిందీ షోలో మన తెలుగు హీరోయిన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంటరైంది. స్టేజీపై ఓ తెలుగు దర్శకుడు ముద్దు పెట్టిన విషయం గురించి మాట్లాడింది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) ప్రియాంక చోప్రా, పరిణితీ చోప్రాలకు బంధువైన మన్నారా చోప్రా.. తెలుగులోకి 'ప్రేమ గీమా జాన్తా నై' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత జక్కన్న, తిక్క, రోగ్, సీత చిత్రాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయింది. ఈ మధ్య రాజ్ తరుణ్ 'తిరగబడరా సామి' సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైంది. కొన్నిరోజుల ముందు జరిగిన ఈ మూవీ ఈవెంట్లో దర్శకుడు ఏఎస్ రవికుమార్.. పబ్లిక్‌లో మన్నారా బుగ్గపై ముద్దుపెట్టేశాడు. అప్పట్లో అందరూ ఈ సంఘటన గురించి తెగ మాట్లాడుకున్నారు. తాజాగా హిందీ 'బిగ్‌బాస్ 17'లో ఈమె కంటెస్టెంట్‌గా ఇచ్చింది. స్టేజీపై రాగానే ఈమె వెల్కమ్ చెప్పిన సల్మాన్.. ఆ ముద్దు గురించి అడిగాడు. దీనికి బదులిచ్చిన మన్నారా.. అది మీరనుకునే ముద్దు కాదని, ప్రేమపూర్వకంగా ఆయన తనకు పెక్ తరహా ముద్దు పెట్టారని చెప్పింది. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక) -
హిట్ కాంబినేషన్లో మరో సినిమా
చాలా కాలం తరువాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు ఎయస్ రవికుమార్ చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తొలి సినిమాగా విడుదలైన 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన రవికుమార్ చౌదరి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా 'సౌఖ్యం' సినిమాను తెరకెక్కిస్తున్న రవికుమార్ చౌదరి ఆ సినిమా పూర్తవ్వగానే కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను కూడా ఫైనల్ చేశాడు రవికుమార్ చౌదరి. 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అదే కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా దిల్‌రాజు నిర్మించనున్నాడు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'సౌఖ్యం' సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నుంచి కళ్యాణ్‌రామ్ సినిమాను ప్రారంభించి సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరోసారి సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.