హిట్ కాంబినేషన్లో మరో సినిమా | one more movie in pilla nuvvu leni jeevitham combination | Sakshi
Sakshi News home page

హిట్ కాంబినేషన్లో మరో సినిమా

Nov 12 2015 12:21 PM | Updated on Sep 3 2017 12:23 PM

హిట్ కాంబినేషన్లో మరో సినిమా

హిట్ కాంబినేషన్లో మరో సినిమా

చాలా కాలం తరువాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు ఎయస్ రవికుమార్ చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తొలి సినిమాగా విడుదలైన 'పిల్లా నువ్వులేని జీవితం'...

చాలా కాలం తరువాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు ఎయస్ రవికుమార్ చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తొలి సినిమాగా విడుదలైన 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన రవికుమార్ చౌదరి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలకు కమిట్ అవుతున్నాడు.

ప్రస్తుతం గోపిచంద్ హీరోగా 'సౌఖ్యం' సినిమాను తెరకెక్కిస్తున్న రవికుమార్ చౌదరి ఆ సినిమా పూర్తవ్వగానే కళ్యాణ్ రామ్ హీరోగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే మరో సినిమాను కూడా ఫైనల్ చేశాడు రవికుమార్ చౌదరి. 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అదే కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా దిల్రాజు నిర్మించనున్నాడు.

గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'సౌఖ్యం' సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నుంచి కళ్యాణ్రామ్ సినిమాను ప్రారంభించి సమ్మర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరోసారి సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement