Manchu Vishnu Shocking Comments Next Maa Elections - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: 'మా' ఎన్నికలు.. మంచు విష్ణు అలాంటి డెసిషన్!

Jul 31 2023 6:56 PM | Updated on Jul 31 2023 7:05 PM

Manchu Vishnu Comments Next MAA Elections - Sakshi

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఆదివారం జరిగాయి. ప్యానల్‌ని గెలిపించిన దిల్ రాజు.. అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో అందరి చూపు మా(మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్) ఎన్నికలపై పడింది. 2021 అక్టోబరులో జరిగిన పోటీలో ప్రకాశ్‍‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. 'మా' ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న విష్ణు.. తాజాగా జరిగిన సర్వసభ‍్య సమావేశంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట.

(ఇదీ చదవండి: సెట్‌లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!)

రెండేళ్ల కాలానికి 'మా' ఎన్నికలు జరుగుతుంటాయి. 2021 అక్టోబరులో జరిగాయి కాబట్టి ఈ ఏడాది సెప్టెంబరులో ఎలక్షన్స్ జరగాలి. అయితే వాటిని వచ్చే ఏడాది మేలో నిర్వహించాలని తీర్మానించినట్లు పలువురు సభ్యుల ద్వారా తెలిసింది. అసోసియేషన్ ఆడిట్ సమస్యలే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు.. మరోసారి 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదాని అనుకుంటున్నారట. తన నిర్ణయాన్ని సభ్యులకు కూడా చెప్పారట.

దీంతో ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే ఎన్నికల గడువు పూర్తయ్యేలోగా సభ్యులకు ఇచ్చిన హామీలని పూర్తి చేయాలనే ఆలోచనతో మంచు విష్ణు ఉన్నట్లు సమాచారం. గతేడాది 'జిన్నా' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విష్ణు.. ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిలయ్యాడు. ప్రస్తుతానికి అయితే కొత్త ప్రాజెక్టులు ఏం చేయట్లేదు. విష్ణు ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడని కొన్నాళ్లు ముందు మోహన్ బాబు చెప్పారు గానీ అది ఎప్పుడనేది ఇంకా క్లారిటీ లేదు.

(ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement