Jennifer Mistry Comments On Taarak Mehta Ka Ooltah Chashmah Show - Sakshi
Sakshi News home page

Jennifer Mistry: బట్టల దుర్వాసన.. నీళ్ల కోసం అడుక్కునే పరిస్థితి

Jul 31 2023 5:00 PM | Updated on Oct 28 2023 1:37 PM

Jennifer Mistry Comments On Taarak Mehta Ka Ooltah Chashmah - Sakshi

టీవీ షోలు అనేది ప్రస్తుతం ట్రెండ్. సినిమాల కంటే వీటి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లే ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయి. 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి జెన్నీఫర్ మిస్త్రీ ఓ నెలన్నర ముందు షో నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించారని పోలీస్ కేసు పెట్టింది. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది. ఇప్పుడు షోలో ఎదురైన మరిన్ని చేదు అనుభవాల్ని బయటపెట్టింది. 

బట్టల నుంచి దుర్వాసన
‍'ప్రొడక్షన్ టీమ్ మా బట్టలు కూడా ఉతికేవాళ్లు కాదు. 20 రోజుల పాటు వాటినే వేసుకునేవాళ్లం. దీంతో వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చేది. చేసేదేం లేక కొన్నిసార్లు మేమే ఉతక్కున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సెట్‌లోని కొందరు కాస్ట్యూమ్స్‌ని మాత్రం వాష్ చేసేవాళ్లు. తాగేనీరు కోసం అడుక‍్కునే పరిస్థితి. ఎందుకంటే సెట్‌లో కొన్న వాటర్ బాటిల్స్ మాత‍్రమే ఉండేవి. ఒకవేళ మేం అవి కావాలని అడిగితే మమ్మల్ని తిట్టేవారు. బిస్కెట్ ప్యాకెట్ కూడా సెట్‌లో మహాప్రసాదంలా అనిపించేది. రాత్రి షిఫ్ట్‌లో అయితే అది కూడా ఇచ్చేవారు కాదు'

(ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?)

వ్యాన్‌లో బొద్దింకలు
'అలానే షో జరిగినన్నీ రోజులు నా సొంత జ్యూవెలర్లీ ధరించేదాన్ని. నా షూస్ చిరుగులు పడినా అవే కొన్నాళ్లపాటు యూజ్ చేశారు. మాకు కనీసం కాస్ట్యూమ్స్ అయినా ఇచ‍్చేవారు. చైల్డ్ ఆర్టిస్టులకు అయితే అవి కూడా ఇవ్వరు. కొవిడ్ టైంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వైరస్ ప్రభావం ఎక్కువైనప్పుడు మాత్రం శానిటైజేషన్ చేశారు అంతే. మేముండే క్యార్ వాన్స్‌లో విపరీతంగా బొద్దింకలు ఉండేవి' అని చెప్పిన జెన్నీఫర్ మిస్త్రీ ఆవేదన వ్యక్తం చేసింది. 

ఎప్పటికి ముగుస్తుందో?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి జెన్నీఫర్ మిస్త్రీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాలు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే గతంలో నిర్మాతలపై కేసు పెట్టిన ఈమె.. ఆయన తన చెంప గిల్లాడని, అసభ్యంగా మాట్లాడుతూ మద్యం తాగాలని బలవంతం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈమెకు సకాలంలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం, వేధింపులకు గురిచేయడంతో ఈ మార్చిలో ఈమె షో నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి షో యాజమాన్యం తీరుపై ఈమె ఆరోపణలు చేస్తూనే ఉంది. మరి ఈ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement