 
													తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ కొన్ని సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఫ్యాన్స్ తో బూతులు తిట్టించుకుంటున్నారు. మొన్న ప్రభాస్ 'కల్కి' విషయంలో ఇలానే జరగ్గా.. ఇప్పుడు లారెన్స్ 'చంద్రముఖి 2' చిత్రంపైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది?
(ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!)
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90స్ జనరేషన్ కి ఈయన్ని బాగా పరిచయం చేసింది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రశంసలు బదులు ట్రోల్స్ వస్తున్నాయి.
ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది. దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్ విడుదల చేశారు. 'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు.
Thanks to Thalaivar Superstar @rajinikanth! Here’s presenting you the first look of #Vettaiyan 👑 I need all your blessings!
— Raghava Lawrence (@offl_Lawrence) July 31, 2023
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🔥 #Chandramukhi2 🗝 pic.twitter.com/v4qYmkzeDh
(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
