
మెగాస్టార్ చిరంజీవి కొణిదెల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్యే చిరు-నయనతార కాంబినేషన్‌లో ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఈ మూవీ నుంచి నయనతార ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు.
దసరాకు సర్‌ప్రైజ్
పసుపురంగు చీరలో, కొప్పున పూలెట్టుకుని, చేతిలో ఓ గొడుగు పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది నయన్. రేపు (అక్టోబర్ 2న) దసరా కానుకగా ఓ సర్‌ప్రైజ్ ఉంటుందన్నారు. అంటే మూవీ నుంచి ఏదైనా గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉండొచ్చన్నమాట! ఇక ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.
Introducing #Nayanthara garu as ‘SASIREKHA’ in our #ManaShankaraVaraPrasadGaru 🤗✨
It’s an absolute joy to have her in this beautiful role and to work with her. Tomorrow, get ready for a delightful surprise from #MSG ❤️#ChiruAnil - Sankranthi 2026 🥳 pic.twitter.com/lvS2TO8fSi— Anil Ravipudi (@AnilRavipudi) October 1, 2025