బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్! | Malavika Krishnadas and Thejus Jyothi welcome their first baby | Sakshi
Sakshi News home page

Malavika Krishnadas: బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో భర్త పోస్ట్!

Nov 5 2024 6:00 PM | Updated on Nov 5 2024 6:14 PM

Malavika Krishnadas and Thejus Jyothi welcome their first baby

ప్రముఖ బుల్లితెర నటి మాళవిక కృష్ణదాస్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతంలో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి.. సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. బిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త తేజస్ జ్యోతి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. బిడ్డ చేతిని పట్టుకున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. మాళవిక కృష్ణదాస్,  తేజస్ జ్యోతి బుల్లితెర జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రముఖ రియాలిటీ షో నాయికా నాయకన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఆ షో ద్వారానే మరింత ఫేమస్ ‍అయ్యారు. రియాలిటీ షోలో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత మాళవిక, తేజస్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ బుల్లితెర ప్రేమజంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాళవిక ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీపై పోస్టులు పెడుతూనే ఉంటోంది. బేబీ షవర్‌ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన భర్తతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కాగా.. మాళివిక కృష్ణదాస్ మలయాళంలో పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement