Mahesh Babu, Trivikram Srinivas Movie Titled As 'Guntur Karam' - Sakshi
Sakshi News home page

Guntur Kaaram Movie: గుంటూరు కారం ఘాటు చూపిస్తానంటున్న మహేశ్‌బాబు

May 31 2023 6:41 PM | Updated on May 31 2023 7:33 PM

Mahesh Babu, Trivikram Srinivas Movie Titled at Guntur Karam - Sakshi

ఏందట్టా చూస్తున్నావు, బీడీ త్రీడీలో కనపడ్తుందా? అంటూ హీరో బీడీ ముట్టించుకున్న తీరు అద్భుతం.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు గుంటూరు కారం అని టైటిల్‌ ఖరారు చేశారు. నేడు (మే 31) కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో వందలాది మంది అభిమానుల సమక్షంలో టైటిల్‌, టీజర్‌ అట్టహాసంగా విడుదల చేశారు. ఇందులో మహేశ్‌ స్వాగ్‌ అదిరిపోయిందంతే.. 'ఏందట్టా చూస్తున్నావు, బీడీ త్రీడీలో కనపడ్తుందా?' అంటూ హీరో బీడీ ముట్టించుకున్న తీరుకు ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేయడం ఖాయం.

ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల ముఖ్యపాత్రలో నటించనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం హారిక అండ్‌ హాసిన బ్యానర్‌లో నిర్మితం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్‌ కానుంది. కాగా అతడు, ఖలేజా తర్వాత గుంటూరు కారంతో మహేశ్‌- త్రివిక్రమ్‌ ముచ్చటగా మూడోసారి జతకట్టారు. ఇది మహేశ్‌బాబు కెరీర్‌లో 28వ సినిమాగా తెరకెక్కుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement