
ప్రభాస్.. ఇప్పుడు 'రాజాసాబ్', ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటితో పాటు లైన్‌లో చాలానే సినిమాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా తీయాల్సిన 'స్పిరిట్' లిస్టులో ముందు వరసలో ఉంది. లెక్క ప్రకారం సెప్టెంబరులోనే షూటింగ్ మొదలవుతుందని చాన్నాళ్ల క్రితం సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ ఇప్పటికే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు షూటింగ్‌తో పాటు మరో అప్‌డేట్ వినిపిస్తుంది.
'యానిమల్' తర్వాత సందీప్ వంగా చేస్తున్న సినిమా 'స్పిరిట్'. చాన్నాళ్ల క్రితమే ప్రకటన వచ్చింది గానీ ప్రభాస్ మూవీస్ లైనప్ వల్ల ఆలస్యమవుతోంది. ఫైనల్‌గా నవంబర్ 5వ తేదీ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని ఫిక్సయ్యారట. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అయితే ప్రభాస్ తండ్రిగా అతిథి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే టాక్ కాస్త గట్టిగానే వైరల్ అవుతోంది. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం)
ఇకపోతే హీరోయిన్‌గా తొలుత దీపిక పదుకొణెని అనుకున్నారు. కానీ పెట్టిన కండీషన్స్ నచ్చక సందీప్ ఆమెని ప్రాజెక్ట్ నుంచి తొలిగించాడనే కొన్నాళ్ల క్రితం వార్తల వచ్చాయి. దీపిక ప్లేసులో తృప్తి దిమ్రి వచ్చింది. ఇప్పుడు మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కూడా 'స్పిరిట్'లో భాగమైందట. తొలుత ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ని తీసుకున్నారట. ఇప్పుడు ఈమె స్థానంలోనే మడోన్నాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమెది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరా? లేదంటే ప్రతినాయక పాత్ర అనేది తెలియాల్సి ఉంది.
మడోన్నా సెబాస్టియన్ విషయానికొస్తే.. మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. తెలుగులో 'ప్రేమమ్' రీమేక్‌లో నాగచైతన్య సరసన నటించింది. తర్వాత 'శ్యామ్ సింగరాయ్' చేసింది. ఇన్నాళ్లకు ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈమెకు అదృష్టం కలిసొచ్చినట్లే!
(ఇదీ చదవండి: 'బాయ్‌కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?)