ఉన్ని ముకుందన్‌ బర్త్‌డే.. 'మా వందే' నుంచి పోస్టర్‌ రిలీజ్‌ | Maa Vande: Special Poster Out on Unni Mukundan Birthday | Sakshi
Sakshi News home page

మోదీ బయోపిక్‌: ఉన్ని ముకుందన్‌ బర్త్‌డే స్పెషల్‌.. పోస్టర్‌ రిలీజ్‌

Sep 22 2025 11:21 AM | Updated on Sep 22 2025 11:33 AM

Maa Vande: Special Poster Out on Unni Mukundan Birthday

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. 'మా వందే' (Maa Vande Movie) పేరిట ఆయన బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan).. మోదీగా నటించనున్నారు. క్రాంతి కుమార్‌ సీహెచ్‌ దర్శకత్వం వహిస్తుండగా వీర్‌ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల (సెప్టెంబర్‌ 17న) మోదీ బర్త్‌డే సందర్భంగా మా వందే ప్రాజెక్ట్‌ ప్రకటించారు. నేడు (సెప్టెంబర్‌ 22) ఉన్ని ముకుందన్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

మోదీ బయోపిక్‌..
ఇందులో మోదీ జనం ఎదుట స్టేజీపై నడుస్తున్నట్లుగా ఉంది. అతడి ఆశయాన్ని, సంకల్పాన్ని తల్లి ఆశీర్వదిస్తున్నట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఈ మూవీలో మోదీ బాల్యం నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అంశాలను చూపించనున్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్‌ ప్రేరణ ఎంతో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఇవ్వనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్‌ చేయనున్నారు.

చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్‌ బిగ్‌బాంబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement