OTT: ఓటీటీని షేక్‌ చేసిన టాప్‌ 10 సిరీస్‌లు అవే.. డిసెంబర్‌లో కొత్తగా 37 సిరీస్‌లు రిలీజ్‌

List Of Upcoming And New Web Series, Movies OTT Releases In This Week And December 2023 - Sakshi

ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. అటు థియేటర్‌లో రిలీజైన సినిమాలను, ఇటు సొంతంగా సినిమాలు, సిరీస్‌లు నిర్మిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా విభిన్న కంటెంట్‌తో సినీప్రియులను ఆకర్షిస్తున్నాయి. 2023కి ముగింపు పలకడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ ఏడాదికిగానూ ఎక్కువ పాపులర్‌ అయిన సిరీస్‌లు ఇవే అని ఐఎమ్‌డీబీ ఓ జాబితా విడుదల చేసింది.

ఇందులో ఫర్జి, గన్స్‌ అండ్‌ గులాబ్స్‌, ద నైట్‌ మేనేజర్‌ వెబ్‌ సిరీస్‌లు టాప్‌ 3లో వరుసగా చోటు దక్కించుకున్నాయి. కోహ్రా, అసుర్‌ 2 నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. రానా నాయుడు ఆరో స్థానంలో ఉండగా దహాద్‌, సాస్‌, బహు ఔర్‌ ఫ్లెమింగో, స్కూప్‌, జూబ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటికి పోటీనిచ్చేందుకు కొత్త సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి డిసెంబర్‌ నెలలో ఓటీటీలోకి వచ్చే చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం...

అమెజాన్‌ ప్రైమ్‌
క్యాండీ కేన్‌ లేన్‌ - డిసెంబర్‌ 1
మేరీ లిటిల్‌ బ్యాట్‌మెన్‌ - డిసెంబర్‌ 8
యువర్‌ క్రిస్‌మస్‌ ఆర్‌ మైన్‌ - డిసెంబర్‌ 8
రేచర్‌ 2 - డిసెంబర్‌ 15

హాట్‌స్టార్‌
ద షెఫర్డ్‌ - డిసెంబర్‌ 1
మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్‪‌ట్రీమ్ హాంటెడ్ హౌస్ - డిసెంబర్ 1
ఇండియానా జోన్స్‌ అండ్‌ ద డయల్‌ ఆఫ్‌ డెస్టినీ - డిసెంబర్‌ 1
ద ఫ్రీలాన్సర్‌: ద కన్‌క్లూజన్‌ - డిసెంబర్‌ 15
బీటీఎస్‌ మోనమెంట్స్‌: బియాండ్‌ ద స్టార్స్‌ - డిసెంబర్‌ 20
పెర్సీ జాక్సన్‌ అండ్‌ ద ఒలంపియన్స్‌ - డిసెంబర్‌ 20

నెట్‌ఫ్లిక్స్‌
మే డిసెంబర్‌ - డిసెంబర్‌ 1
మిషన్‌ రాణిగంజ్‌ - డిసెంబర్‌ 1
స్వీట్‌ హోమ్‌ 2 - డిసెంబర్‌ 1
ద ఆర్చీస్‌ - డిసెంబర్‌ 7
మై లైఫ్‌ విత్‌ ద వాల్టర్‌ బాయ్స్‌ - డిసెంబర్‌ 7
జిగర్‌తాండ డబుల్‌ ఎక్స్‌ - డిసెంబర్‌ 8
లీవ్‌ ద వరల్డ్‌ బిహైండ్‌ - డిసెంబర్‌ 8
ద క్రౌన్‌ సీజన్‌ 6, రెండో భాగం - డిసెంబర్‌ 14
చికెన్‌ రన్‌: డాన్‌ ఆఫ్‌ ద నగ్గెట్‌ యానిమేట్‌ ఫిలిం - డిసెంబర్‌ 15

ట్రెవర్‌ నోవా: వేర్‌ వాస్‌ ఐ - డిసెంబర్‌ 19
మాస్ట్రో - డిసెంబర్‌ 20
రెబల్‌ మూన్‌: ద చైల్డ్‌ ఆఫ్‌ ఫైర్‌ - డిసెంబర్‌ 22
జియోంగ్‌సియోంగ్‌ క్రియేచర్‌ సీజన్‌ 1 పార్ట్‌ 1 - డిసెంబర్‌ 22
కర్రీ అండ్‌ సైనేడ్‌: ద జెల్లీ జోసెఫ్‌ కేస్‌ డాక్యుమెంటరీ - డిసెంబర్‌ 22
రిక్కీ జెర్వాయిస్‌: అర్మగెడాన్‌ - డిసెంబర్‌ 25
మనీ హెయిస్ట్‌ బెర్లిన్‌ - డిసెంబర్‌ 29

లయన్స్‌ గేట్‌ ప్లే
డిటెక్టివ్‌ నైట్‌: రోగ్‌ - డిసెంబర్‌ 1

జియో సినిమా
800 (సినిమా) - డిసెంబర్‌ 2
జర హట్కే జర బచ్కే - డిసెంబర్‌ 2
స్మోదర్‌డ్‌ - డిసెంబర్‌ 8
స్కూబీ డూ అండ్‌ క్రిప్టో టూ - డిసెంబర్‌ 10
ద బ్లాకెనింగ్‌ - డిసెంబర్‌ 16
ఆస్టరాయిడ్‌ సిటీ - డిసెంబర్‌ 25

సోనీలివ్‌
చమక్‌ సిరీస్‌ - డిసెంబర్‌ 7

జీ5
కడక్‌ సింగ్‌ - డిసెంబర్‌ 8
కూసే మునిస్వామి వీరప్పన్‌ - డిసెంబర్‌ 8

యాపిల్‌ టీవీ
ద ఫ్యామిలీ ప్లాన్‌ - డిసెంబర్‌ 15

చదవండి: ఆ కంటెస్టెంట్‌ చేతికి ఫినాలే అస్త్ర.. ఎలిమినేషన్‌ గండం గట్టెక్కితేనే టాప్‌ 5లోకి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top