ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్‌.. లేటెస్ట్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల | Lata Mangeshkar Being Treated For COVID-19 And Pneumonia | Sakshi
Sakshi News home page

Lata Mangeshkar: మరో 10-12 రోజులు అబ్జర్వేషన్‌లోనే లతా మంగేష్కర్‌..

Jan 12 2022 1:00 PM | Updated on Jan 12 2022 1:36 PM

Lata Mangeshkar Being Treated For COVID-19 And Pneumonia - Sakshi

Lata Mangeshkar Latest Health Bulletin Released: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ అప్‌డేట్‌ రిలీజ్‌ అయ్యింది. 'ప్రస్తుతం కోవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్న లతా మంగేష్కర్‌ ఇంకా ఐసీయూ వార్డులోనే చికిత్స పొందుతున్నారు. మరో 10-12 రోజుల పాటు ఆమె అబ్జర్వేషన్‌లో ఉండనున్నారు.

కోవిడ్‌తో పాటు న్యూమోనియాతో బాధపడుతున్నారు' అని తెలిపారు. ఈ మేరకు లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement