పదింటికే చలీ జ్వరం... | Kya Lafda song release from Double iSmart | Sakshi
Sakshi News home page

పదింటికే చలీ జ్వరం...

Jul 30 2024 12:04 AM | Updated on Jul 30 2024 12:04 AM

Kya Lafda song release from Double iSmart

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వీరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రూపొందింది. కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేస్తోంది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్‌ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్‌ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్‌పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, జియాని జియాన్నెలి.  

Advertisement
 
Advertisement
Advertisement