జెంటిల్‌మన్‌లో భాగమవడం సంతోషం – ప్రాచీ తెహ్లాన్ | Sakshi
Sakshi News home page

జెంటిల్‌మన్‌లో భాగమవడం సంతోషం – ప్రాచీ తెహ్లాన్

Published Mon, Oct 2 2023 1:34 AM

KT kunjumon annouces the lead actor for gentleman 2 - Sakshi

‘‘జెంటిల్‌మన్‌ 2’ సినిమాలో నటించాలని నిర్మాత కేటీ కుంజుమోన్ గారు ఫోన్‌ చేసినప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. ఓ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఫ్రాంచైజీలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హీరోయిన్‌ ప్రాచీ తెహ్లాన్  అన్నారు. అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో  శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జెంటిల్‌మేన్‌’. కేటీ కుంజుమోన్‌ నిర్మించిన ఈ సినిమా 1993లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జెంటిల్‌మన్‌ 2’ నిర్మిస్తున్నారు కుంజుమోన్‌. చేతన్‌ చీను హీరోగా ఎ.గోకుల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావడంపైప్రాచీ తెహ్లాన్‌ మాట్లాడుతూ–‘‘జెంటిల్‌మన్‌ 2’ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర చేస్తున్నాను. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ మెప్పించబోతున్నాను. ఈ సీక్వెన్స్ లో నటించటం సవాల్‌తో కూడుకున్నది.. ఇందుకోసం శిక్షణ తీసుకున్నాను. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement