
‘‘షూటింగ్ బాగా జరుగుతోంది’’ అంటూ రజనీకాంత్ చిరునవ్వు నవ్వుతూ మీడియాతో పేర్కొన్నారు. అలాగే తన అభిమానులను ఆనందపరిచే ఒక న్యూస్ కూడా చెప్పారు. ‘జైలర్ 2’ రిలీజ్ ఎప్పుడు? అని అడిగిన మీడియాతో ‘జూన్ 12న’ అని చెప్పారు రజనీకాంత్. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘జైలర్’ (2023) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ‘జైలర్’ రూపొందుతోంది. ఈ చిత్రం కేరళ షెడ్యూల్‌ని ముగించుకుని చెన్నై చేరుకున్న రజనీకాంత్‌తో ఎయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులు షూటింగ్, రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించారు. షూటింగ్ బాగా జరుగుతోందని చెప్పడంతో పాటు విడుదల తేదీ కూడా చెప్పారు రజనీకాంత్. దాంతో ‘జైలర్’ సీక్వెల్ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రజనీ అభిమానులు ఖుషీ అయ్యారు.
2026 జూన్ 12న ‘జైలర్ 2’ విడుదల కానుంది. తొలి భాగంలో రజనీ భార్యగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆ పాత్రలో కనిపిస్తారు. అలాగే ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్రలు చేసిన మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ కూడా రెండో భాగంలో నటిస్తున్నారు. ఇంకా బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.