జవాన్‌ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌! | Kollywood Star Director Atlee Shares Jawan Record World Wide | Sakshi
Sakshi News home page

Atlee: జవాన్‌ మూవీ క్రేజీ రికార్డ్.. అట్లీ పోస్ట్‌ వైరల్!

Jun 6 2024 5:12 PM | Updated on Jun 6 2024 5:23 PM

Kollywood Star Director Atlee Shares Jawan Record World Wide

కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ, బాలీవుడ్ బాద్‌షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్‌ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.

అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్‌ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. వరల్డ్‌ వైడ్‌గా గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్  వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement