రివాల్వర్‌ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్‌.. అప్‌డేట్‌ వచ్చేసింది! | Keerthy Suresh Completes Her Latest Movie | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ‘రివాల్వర్‌ రీటా’గా కీర్తిసురేశ్.. షూటింగ్‌ అప్‌డేట్‌ ఇదే!

May 3 2024 10:59 AM | Updated on May 3 2024 5:48 PM

Keerthy Suresh Completes Her Latest Movie

మాలీవుడ్‌లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్‌లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌పుల్‌ హీరోయిన్‌గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్‌లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్‌ ధావన్‌కు జంటగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్‌ అయిన తెరి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్‌ చిత్రం కీర్తిసురేశ్‌ను నిరాశపరిచింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్‌ రీటా ఒకటి. ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్‌ కింగ్‌స్లీ, మైమ్‌గోపీ, సెండ్రాయిన్, స్టంట్‌ మాస్టర్‌ సూపర్‌సుబ్బరాయన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్‌ స్టూడియోస్, ది రూట్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో చివరి షూటింగ్‌లో కేక్‌ కట్‌ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..  కీర్తిసురేశ్‌ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement