ప్రభాస్ పుట్టినరోజు.. కన్నప్ప చిత్రబృందం స్పెషల్ పోస్టర్! | Kannappa Team Special Wishes To Rebal star Prabhas on his Birthday | Sakshi
Sakshi News home page

Prabhas Birthday: ప్రభాస్ పుట్టినరోజు.. కన్నప్ప చిత్రబృందం స్పెషల్ పోస్టర్!

Oct 23 2023 1:12 PM | Updated on Oct 23 2023 2:44 PM

Kannappa Team Special Wishes To Rebal star Prabhas on his Birthday - Sakshi

యంగ్ రెబల్ స్టార్‌కు కన్నప్ప చిత్రబృందం స్పెషల్ విషెస్ తెలిపింది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్‌తో పాటు ప్రభాస్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

పోస్టర్‌లో ప్రభాస్ గురించి రాస్తూ.. 'ప్రభంజనమై ప్రేక్షక హ‌ృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి శత శత మానం భవతి' అంటూ కన్నప్ప టీం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

(ఇది చదవండి: నువ్వసలు ఆడటానికే వచ్చావా? అన్న గీతూ.. దండం పెట్టేసిన పూజా)

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనా సహకారం అందించారు. 

(ఇది చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!)

Advertisement
 
Advertisement
Advertisement