బాలీవుడ్‌లో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు: కంగనా రనౌత్‌ | Kangana Ranaut Sensational Comments On Bollywood | Sakshi
Sakshi News home page

నాతో పని చేయొద్దని చాలామంది నటులకు ఫోన్లు చేశారు ఫ కంగనా రనౌత్‌

Aug 25 2024 12:50 PM | Updated on Aug 25 2024 1:19 PM

Kangana Ranaut Sensational Comments On Bollywood

‘‘బాలీవుడ్‌లోని పలువురు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. నా సినిమాల్లో నటించొద్దని చాలామందికి ఫోన్స్‌ చేసి మరీ చెప్పారు’’ అన్నారు హీరోయిన్‌ కంగనా రనౌత్‌. ఆమె లీడ్‌ రోల్‌లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాని కంగనా రనౌత్, రేణు పిట్టి నిర్మించారు. పలు వాయిదాల తర్వాత సెప్టెంబర్‌ 6న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ– ‘‘బాలీవుడ్‌లో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. పలువురు క్యాస్టింగ్‌ దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్‌ నాతో పని చేయడానికి నిరాకరించారు. అంతేకాదు... నాతో పని చేయొద్దని చాలామంది నటులకు ఫోన్లు చేశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులు, సవాళ్ల మధ్య అనుపమ్‌ ఖేర్, సతీష్‌ కౌశిక్, మహిమా చౌదరి వంటి నటీనటులతో ‘ఎమర్జెన్సీ’ కోసం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వారు నా సినిమాలో భాగమవడంతో పాటు నన్నెంతో ప్రేమగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement