
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) దేశంలో పెరిగిపోతున్న సహజీవనం సంస్కృతిపై తనదైన శైలిలో స్పందించింది. లీవ్-ఇన్ రిలేషన్ షిప్‌కు తను పూర్తిగా వ్యతిరేకం అని అంటుంది. అందులో భాగస్వాముల మధ్య భద్రత, నమ్మకం రెండూ ఉండవని అంటోంది.
"ఒకవేళ లీవ్-ఇన్‌లో మహిళ గర్భం దాలిస్తే ఆమెకు అబార్షన్ ఎవరు చేయిస్తారు? ఒకవేళ ఆ మహిళ అబార్షన్ వద్దనుకుంటే తనని ఎవరు సంరక్షిస్తారు? అప్పటివరకు సహజీవనం చేసిన ఆ పురుషుడు గర్భం చేసి పారిపోడన్న గ్యారెంటీ ఉందా?"
అదే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య ఓ బంద్ధం అంటూ ఉంటుందని, ఆ బంధానికి తల్లిదండ్రులు, బందువులు రక్షణగా ఉంటారని కంగనా చెబుతోంది.
ఈ సంధర్భంగా డేటింగ్ యాప్స్‌పై కంగనా విరుచుకుపడింది. దేశంలో సహజీవనం సంస్కృతి పెరగడానికి కారణం డేటింగ్ యాప్స్ అని ఆరోపించింది.
మహిళకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కూడా ఉండాలి కానీ లీవ్-ఇన్ రిలేషన్ షిప్ కోసం ఆ స్వేచ్ఛను వాడడం సరైన పద్ధతి కాదని కంగనా అంటోంది.