
బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘క్వీన్’ రెండో భాగం రానుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో నటించిన తొలి భాగం 2014లో విడుదలైంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ సన్నాహాలు ఊపందుకున్నాయని బాలీవుడ్ సమాచారం. ‘క్వీన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వికాస్ ‘క్వీన్ 2’ సినిమానూ డైరెక్ట్ చేయనున్నారని, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని టాక్. అంతే కాదు... ఈ ‘క్వీన్ 2’ చిత్రీకరణకు వికాశ్ లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారట. ‘క్వీన్’ సినిమా మాదిరిగానే, ‘క్వీన్ 2’ చిత్రీకరణ కూడా కొంత ఇండియాలో, ఎక్కువ శాతం విదేశాల్లో జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.
నవంబరులో ఈ సినిమా షూటింగ్‌లో కంగనా రనౌత్ పాల్గొంటారట. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. మరి... అనుకున్నట్లుగానే పదేళ్ల తర్వాత ‘క్వీన్’ సీక్వెల్ తెరకెక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక మరో రెండు రోజుల్లో రాణి (కంగన) పెళ్లి అనగా, పెళ్లికొడుకు రాణితో పెళ్లిని వద్దనుకుంటాడు. ఆ తర్వాత రాణి తనను తాను బలమైన అమ్మాయిగా మలచుకుని, జీవితంలో ఎలా రాణించింది? రాణిని వద్దనుకున్న అబ్బాయే, ఆమెను మళ్లీ ఎలా వివాహం చేసుకున్నాడు? అనే కోణంలో ‘క్వీన్’ కథ సాగుతుంది.