
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి'. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఆన్‌లైన్ పెట్టిన టికెట్స్ పెట్టినట్లు అయిపోతున్నాయి. మరోవైపు ట్రైలర్ చూపించినోళ్లే కాకుండా మూవీలో ఇంకా స్టార్ నటీనటులు చాలామంది యాక్ట్ చేశారనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మూవీలో ఎవరెవరు నటించారు? వాళ్ల పాత్రలేంటి తెలుసుకుంటే సినిమా అర్థం చేసుకోవడం మీకు కాస్త సులభమైపోతుంది!
ప్రభాస్ది భైరవ అనే పాత్ర. కాంప్లెక్స్ అనే ప్రాంతానికి వెళ్లడం కోసం ఎలాంటి పనైనా చేసే ఓ తుంటరి కుర్రాడి పాత్ర.
అశ్వధ్థామగా అమితాబ్ బచ్చన్ నటించారు. మహాభారతంలో కౌరవులు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుడి కొడుకే ఈ అశ్వధ్ధాముడు. యుద్ధంలో తన తండ్రిని చంపిన పాండవుల వంశాన్ని అంతం చేయాలనుకుంటాడు. కానీ కృష్ణుడి శాపానికి గురై ఒంటి నిండా గాయలతో విశ్వం అంతం వరకు ఉండే పాత్ర.
సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ నటించాడు. అయితే కమల్‌ది కలి పాత్రలా అనిపిస్తోంది. అధర్మం ఎక్కడ జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడే కలి.
దీపికా పదుకొణె 'సమ్-80' అనే రోల్ చేసింది. పురాణాల్లో 'కల్కి' తల్లి పేరు సుమతి. దీనికి ఈ సినిమాలో దీపిక పాత్రకు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ కారు బుజ్జికి కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈమె కనిపించదు గానీ గొంతు మాత్రం సినిమా అంతా వినిపిస్తుంది.
ఉత్తర పాత్రలో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈమెపైనే అశ్వథ్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే.. కృష్ణుడు ఇతడిని శపిస్తాడు.
దిశా పటానీ రోక్సీ అనే అమ్మాయిగా నటించింది. బహుశా ప్రభాస్‌కి జోడీగా ఈమె కనిపిస్తుంది. సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఓ డ్యూయెట్ కూడా ఉంది.
ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్స్, ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే వీళ్లు సినిమాలో అధికారికంగా ఉన్నట్లు చూపించారు. కానీ చాలామంది స్టార్స్ 'కల్కి' అతిథి పాత్రలు చేశారని టాక్.
మహాభారతం ఎపిసోడ్‌లో కృష్ణుడు కచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. కాకపోతే దీన్ని ఏఐ టెక్నాలజీ రూపొందించారట.
అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అభిమన్యుడిగా నాని.. అలానే భైరవ తల్లిదండ్రులుగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కనిపిస్తారని టాక్.
వీళ్లే కాకుండా ప్రముఖ దర్శకులు ఆర్జీవీ, రాజమౌళి కూడా అతిథి పాత్రలు చేశారని తెలుస్తోంది. మరి అవేంటి తెలియాల్సి ఉంది.
ఒకప్పుడు 'మహాభారతం' ఆధారంగా తెలుగులో సినిమాలు వచ్చాయి. కానీ రీసెంట్ టైంలో మాత్రం రాలేదని చెప్పుచ్చు. మరి నాగ్ అశ్విన్.. మహాభారతాన్ని ఎంత కన్విన్సింగ్‌గా చూపించాడనేది మరికొన్ని గంటల్లే తేలిపోతుంది.