ఓటీటీలో హారర్‌, థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌ | Kalinga Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో హారర్‌, థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌

Sep 28 2024 1:56 PM | Updated on Sep 28 2024 3:21 PM

 Kalinga Movie OTT Streaming Date Locked

కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కళింగ' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్‌లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే, కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా  ధృవ వాయు పనిచేశారు. ప్ర‌గ్యా న‌య‌న్ హీరోయిన్‌గా న‌టించిగా మీసాల ల‌క్ష్మ‌ణ్‌, ఆడుకాలం న‌రేన్‌, బ‌ల‌గం సుధాక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

హారర్‌ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి కళింగ విడుదల కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అక్టోబర్‌  2 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుందన ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

కథేంటి..?
కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.

Advertisement
 
Advertisement
Advertisement