కన్నప్పలో కాజల్‌ | Sakshi
Sakshi News home page

కన్నప్పలో కాజల్‌

Published Sat, May 18 2024 3:36 AM

Kajal Aggarwal In A Significant Role In Vishnu Manchu Kannappa

విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా చిత్ర యూనిట్‌ శుక్రవారం వెల్లడించింది.

ఇంకా ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌ కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మోసగాళ్ళు’ (2021) మూవీ  కోసం విష్ణు మంచు, కాజల్‌ అగర్వాల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం కలిశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement