ఒకప్పటితో పోలిస్తే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాదు కాదు కొందరు వ్యాపారాలు చేసేస్తున్నారు. దీని వల్ల యువతరం, చిన్న పిల్లలు.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఈ సంగతులన్నీ జనాలకు తెలుసు. రోజూ పేపర్, టీవీ, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ద ఇండియా స్టోరీ'. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే శుక్రవారం(జూలై 24) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి సదరు తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్‌తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్‌తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.
ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇందులో చూపించినవన్నీ చేదు నిజాలే. జనాలకు కూడా ఇలాంటి కల్తీ, క్రిమి సంహారక మందుల గురించి తెలుసు. అయినా సరే వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇవి తింటున్న పరిస్థితి. ఇవి కాకుండా మూవీలో ఇంకేం చూపిస్తారో చూడాలి? ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై ఏ మాత్రం బజ్ లేదు.
(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రీతి ముకుందన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?)


