breaking news
The India Story Movie
-
బొడ్డు, నడుము ఫాంటసీ.. చాలా మారింది
భారతీయ సినిమాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు,తమిళంలో స్టార్ హీరోలతో దాదాపుగా నటించింది. 'మగధీర' మూవీ ఈమెని ఓవర్ నైట్ స్టార్ చేస్తే తర్వాత వచ్చిన పలు చిత్రాలు ఈమెని స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. అలా నటిగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే 2020లో గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)పెళ్లి, పిల్లలు కారణంగా కొన్నాళ్ల గ్యాప్ తీసుకుంది. కానీ గత కొన్నేళ్లలో మళ్లీ నటిగా యాక్టివ్ అయిపోయింది. తెలుగులో బాలకృష్ణ సరసన ఓ మూవీ చేస్తోంది. మరోవైపు హిందీలో రామాయణ, ది ఇండియా స్టోరీ చిత్రాల్లోనూ నటించింది. ది ఇండియా స్టోరీ.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలో ఇస్తోంది. ఈ సందర్భంగా దక్షిణాది గురించి కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.దక్షిణాదిలో హీరోయిన్ బొడ్డు, నడుము చూపించడానికి ఆసక్తి చూపుతారనే ప్రశ్నకు కాజల్ బదులిస్తూ.. ఇంతకు ముందు అలాంటి అపోహ ఉండేదేమో గానీ గత కొద్దికాలంగా దక్షిణాది సినిమా అలాంటి విషయాల్లో చాలా మారిపోయిందని చెప్పుకొచ్చింది. గతంలో తమన్నా, తాప్సీ లాంటి వాళ్లు దక్షిణాది చిత్రపరిశ్రమతో సాయంతో స్టార్స్‌గా ఎదిగి తర్వాత మనపైనే విమర్శలు చేశారు. కాజల్ మాత్రం గుర్తింపు తీసుకొచ్చిన ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తోంది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?) -
రైతుల్ని ఉగ్రవాదులు అంటావా? కాజల్ కొత్త సినిమా ట్రైలర్
ఒకప్పటితో పోలిస్తే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాదు కాదు కొందరు వ్యాపారాలు చేసేస్తున్నారు. దీని వల్ల యువతరం, చిన్న పిల్లలు.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఈ సంగతులన్నీ జనాలకు తెలుసు. రోజూ పేపర్, టీవీ, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ద ఇండియా స్టోరీ'. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే శుక్రవారం(జూలై 24) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి సదరు తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్‌తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్‌తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇందులో చూపించినవన్నీ చేదు నిజాలే. జనాలకు కూడా ఇలాంటి కల్తీ, క్రిమి సంహారక మందుల గురించి తెలుసు. అయినా సరే వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇవి తింటున్న పరిస్థితి. ఇవి కాకుండా మూవీలో ఇంకేం చూపిస్తారో చూడాలి? ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై ఏ మాత్రం బజ్ లేదు.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రీతి ముకుందన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?) -
ది ఇండియా స్టోరీ రెడీ
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే నటించిన చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్...’ అన్నది ట్యాగ్‌లైన్. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించి, నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చేతన్ డీకే మాట్లాడుతూ–‘‘విషపూరిత పురుగు మందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. మోసంతో నడిచే వ్యవస్థను ప్రశ్నిస్తే మొదట ఎదురయ్యేది భయం, ఆగ్రహమే. ‘ది ఇండియా స్టోరీ’లోని ప్రతి సన్నివేశం ఆ పోరాటాన్ని చూపించడంతో పాటు మనం తినేది, నమ్మేది గురించి ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తుంది. సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని కోర్ట్ రూమ్ డ్రామా రూపంలో చూపిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
కళ్లు తెరిపించేలా...
‘‘సాధారణ ప్రజలు ప్రతి రోజూ వినియోగించే ఆహార పదార్థాల వెనక దాగి ఉన్న ప్రమాదాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఈ అంశంపై సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నంగా ‘ది ఇండియా స్టోరీ’ సినిమాను తెరకెక్కించాం’’ అని పేర్కొన్నారు డీకే చేతన్. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ఇండియా స్టోరీ. డీకే చేతన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సహకారంతో సాగర్ బి. షిండే నిర్మించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు.ఈ సినిమా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ముంబై హైకోర్టు నేపథ్యంలో సాగే కోర్టు రూమ్ డ్రామా ఇది. గురువారం ఈ సినిమా అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో కాజల్ చేతిలో ఉన్న ఫైల్‌పై క్యాన్సర్ ఫైల్స్ అని కనిపిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ న్యాయవాది పాత్రలో కనిపిస్తారు.‘‘ఆహార కల్తీ కారణంగా కుటుంబ సభ్యులు, కావాల్సినవారిని కోల్పోయిన ప్రతి భారతీయుడి కథే ఈ సినిమా. మన సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఆహార కల్తీ ఒకటి. మనందరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశం ఇది. ఈ సినిమాలో ఉన్న బలమైన సందేశం ప్రతి ఒక్కరి కళ్లు తెరిపించేలా ఉంటుంది. ప్రతి రోజూ తాము తీసుకునే ఆహారం విషయంలో మరింత అవగాహనతో ఉండాలని ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు చేతన్ డీకే. -
కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!
టాలీవుడ్లో స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో అద్భుతమైన యాక్టింగ్ చేసి హిట్ కొట్టింది. తర్వాత చేసిన వాటిలో మూడేళ్ల క్రితం 'భగవంత్ కేసరి' మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమెది పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజైన 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్‌గా లీడ్ రోల్ చేసిన 'ద ఇండియన్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే షూటింగ్ పూర్తవగా ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ప్రకటించారు.జూలై 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇందులో కాజల్‌తోపాటు మరాఠీ స్టార్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్ర చేశాడు. పంటకు ఉపయోగించే రసాయనాల దుర్వినియోగం, సాగులో పురుగు మందుల మితిమీరిన వినియోగం, దీని వెనకున్న భారీ కుంభకోణాల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మూవీస్ చేయాలనుకుంటే మాత్రం ఇది హిట్ కావడం కాజల్‌కి చాలా కీలకం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకొన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మాత్రం మెల్లగా ఈమెని పట్టించుకోవడం దర్శకులు తగ్గించేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?')


