'ది ఒడిస్సీ' తొలిరోజు వసూళ్లు ఎంత? | The Odyssey Movie Day 1 Collection Worldwide | Sakshi
Sakshi News home page

The Odyssey Collection: మొదటిరోజు వందల కోట్లు.. మరి మన దేశంలో ఎంతొచ్చాయ్?

Jul 18 2026 3:16 PM | Updated on Jul 18 2026 3:24 PM

The Odyssey Movie Day 1 Collection Worldwide

హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ముందు కొంత నెగిటివిటీ వినిపించింది గానీ రిలీజైన తర్వాత అంతటా పాజిటివ్ టాక్ తప్పితే మరొకటి వినిపించడం లేదు.‍ మరి ఇంతలా సౌండ్ చేస్తున్న ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయ్? మొదటిరోజు మన దగ్గర ఎన్ని కోట్లు వచ్చాయ్?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..)

మ్యాట్ డామన్, ఆన్ హాత్వే, టామ్ హోలండ్, రాబర్ట్ పాటిన్సర్, జెండాయా ప్రధాన పాత్రల్లో కనిపించిన 'ది ఒడిస్సీ' సినిమాని మూడువేళ్ల ఏళ్ల క్రితం హోమర్ అనే రచయిత రాసిన ఒడిస్సీ నవల ఆధారంగా తీశారు. రూ.2200 కోట్ల బడ్డెట్‌తో నిర్మించారు. విడుదల కావడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలిరోజు అదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.418 కోట్లు) వచ్చాయి. ఇందులో మన దేశం నుంచి రూ.17 కోట్ల మేర నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టాక్ పాజిటివ్ రావడం, దగ్గరలో మరో సినిమా లేదు కాబట్టి వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర 'ది ఒడిస్సీ' సినిమా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశమైతే ఉంది. తెలుగు, హిందీ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయడం ఈ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

'ది ఒడిస్సీ' విషయానికొస్తే.. ఒడిసియస్(మ్యాట్ డామన్) ట్రోజన్ యుద్ధంలో పదేళ్ల పాటు పోరాడి గెలుస్తాడు. త్వరగా భార్య పెనలోపి(ఆన్ హాత్వే), కొడుకు టెలీమాకస్(టామ్ హాలెండ్) దగ్గరకు వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన సైనికులతో కలిసి పడవ ప్రయాణం చేస్తాడు. అయితే దారిలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దీంతో పదేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి రాజ్యానికి చేరుకుంటాడు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement