హీరోయిన్ గా 'గుప్పెడంత మనసు' జగతి.. గ్లింప్స్ రిలీజ్ | Jyothi Rai KILLR Movie Glimpse | Sakshi
Sakshi News home page

KILLR Glimpse: జ్యోతి రాయ్ తెలుగు సినిమా.. గ్లింప్స్ రిలీజ్

Apr 30 2025 1:02 PM | Updated on Apr 30 2025 1:02 PM

Jyothi Rai KILLR Movie Glimpse

తెలుగులో 2020-24 మధ్య 'గుప్పెడంత మనసు' అనే సీరియల్ ప్రసారమైంది గుర్తుందా? ఇందులో జగతి మేడమ్ గా నటించి, ఆకట్టుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈమె చేసిన తెలుగు సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు)   

గతంలో కన్నడలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఒకటి రెండు మూవీస్ తెలుగులోనే చేస్తోంది. అందులో ఒకటే కిల్లర్. తాజాగా ఈ చిత్ర టీజర్ నే విడుదల చేశారు.

వైమానిక శాస్త్రం అని కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. ఇందులో జ్యోతి రాయ్ గ్లామరస్ గా కనిపించింది. అదే టైంలో రోబో తరహా పాత్ర కూడా చేయడం విశేషం. త్వరలో రిలీజ్ సహా ఇతర వివరాలు వెల్లడిస్తారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో.. ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

(ఇదీ చదవండి: పవన్‌ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్‌మెంట్‌!   

డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్.. పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో చూపించారు. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ స్టన్నింగ్ యాక్షన్ చేసింది. 

మరి ఈ సినిమాకు ముందు మొదలైందో, తర్వాత మొదలైందో గానీ కిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించిన పూర్వజ్ తో జ్యోతి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరు చివర పూర్వజ్ అని మార్పు చేసుకుంది. గతంలో ఈమెకు పెళ్లవగా ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఏదేమైనా సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా హీరోయిన్ కావడం అంటే విశేషమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement