బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే? | Jubilee Hills Police Given Notices To Bigg Boss Organizers Over Violence Happened On Grand Finale Day - Sakshi
Sakshi News home page

Notices To Bigg Boss Organizers: బిగ్ బాస్ నిర్వాహకులకు షాకిచ్చిన పోలీసులు!

Dec 25 2023 9:30 PM | Updated on Dec 28 2023 7:19 PM

Jubilee Hills Police Given Notices To Bigg Boss Organizers about Incident - Sakshi

పల్లవి ప్రశాంత్‌ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత  అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. 

తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement