దక్షిణాదిన బిజీబిజీ.. బాలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అయిన నటుడు | John Kokken Bollywood Entry with The Freelancer Web Series | Sakshi
Sakshi News home page

John Kokken: 17 ఏళ్లుగా సౌత్‌లో బిజీబిజీ.. ఎట్టకేలకు బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అయిన నటుడు

Aug 28 2023 2:03 PM | Updated on Aug 28 2023 2:58 PM

John Kokken Bollywood Entry with The Freelancer Web Series - Sakshi

తెలుగులో దరువు, 1 నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్‌ లీ, వీరసింహరెడ్డి వంటి సినిమాల్లో నటించిన జాన్‌ కొక్కెన్‌, తమిళంలో వీరం, సార్పట్ట పరంపరై, తుణివు వంటి పలు చిత్రాల్లో

సినిమాకు భాషాబేధం లేదు.. ఇక్కడ ప్రతిభే ప్రధానం. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్స్‌ కన్ను దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడిందనే విషయం తెలిసిందే. సంజయ్‌ దత్‌, జాకీ ష్రాఫ్‌ సహా అనేకమంది ప్రముఖ బాలీవుడ్‌ నటులు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దక్షిణాది సినిమాల్లో గర్తింపు తెచ్చుకున్న నటుడు జాన్‌ కొక్కెన్‌ బాలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అయ్యారు. మలయాళ కుటుంబానికి చెందిన ఈయన పుట్టి పెరిగింది ముంబైలో.. కానీ నటుడిగా రంగ ప్రవేశం చేసింది మాత్రం మాతృభాష అయిన మలయాళంలోనే.

దాదాపు 17 ఏళ్లుగా మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో దరువు, 1 నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్‌ లీ, వీరసింహరెడ్డి వంటి సినిమాల్లో నటించిన జాన్‌ కొక్కెన్‌.. తమిళంలో వీరం, సార్పట్ట పరంపరై, తునివు(తెగింపు) వంటి పలు చిత్రాల్లో సత్తా చాటారు. అదేవిధంగా ధనుష్‌ హీరోగా నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషించారు.

ఈయన తాజాగా 'ది ఫ్రీలాన్సర్‌' అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించడం విశేషం. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీబీఐ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రను పోషించినట్లు జాన్‌ కొక్కెన్‌ తెలిపారు. తన పాత్ర చాలా సాఫ్ట్‌గా వైవిధ్య భరితంగా ఉంటుందన్నారు. తాను నటిస్తున్న తొలి హిందీ వెబ్‌ సిరీస్‌ ఇదనీ, తనకిది చాలా స్పెషల్‌ అని పేర్కొన్నారు. నీరజ్‌ పాండే క్రియేటివ్‌ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. మోహిత్‌ రైనా, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: వడివేలు ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement