వెయ్ దరువెయ్!
తమిళసినిమా: బాలల ఇతివృత్తంతో రూపొందే చిత్రాలకు ప్రత్యేకత ఉంటుంది. అదీ యానిమేషన్ కథా చిత్రాలయితే ఆ ఎంటర్‌టైన్‌మెంటే వేరు. అలాంటి బాలల ఇతివృత్తంతో కూడిన యానిమేషన్ కథా చిత్రం కీకీ అండ్ కోకో. ఇనికా ప్రొడక్షన్‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నారాయణన్ దర్శకత్వం వహించారు. సత్య.సి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం టైటిల్, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇనికా ప్రొడక్షన్‌న్స్ ప్రధాన కార్యదర్శి మీనా మాట్లాడుతూ కీకీ అండ్ కోకో యానిమేషన్ చిత్రం తమకు చాలా గర్వకారణం అన్నారు. నేను సింగిల్ పేరెంట్‌గా తన పిల్లలను చక్కగా పెంచానన్నారు. బాలల ఇతివృత్తంతో చిత్రం చేయాలని భావించినప్పుడు దర్శకుడు నారాయణన్ చెప్పిన పలు కథల్లో ఈ చిత్రం కథ వచ్చిందన్నారు. ఇండియాలోనే రూపొందించిన తొలి యానిమేషన్ చిత్రం ఇదని పేర్కొన్నారు. దర్శకుడు పూరీనారాయణన్ మాట్లాడుతూ పిల్లలు కలగడం అన్నది అందరికీ వరం అనే ఈ చిత్రంలో చెప్పినట్లు పేర్కొన్నారు. స్పైడర్ మాన్ ఎగరడం, బ్యాట్ మాన్ కొట్టడం లాంటి నిజం జీవితంలో పలు ఫ్యాంటసీ విషయాలు పిల్లల కోసం ఈ చిత్రంలో చూపించినట్లు చెప్పారు. ఇతరులకు సాయం చేయడం, పొందిన సాయానికి కృతజ్ఞతగా ఉండడం, నవ్వించడం వంటి మంచి పనులు చేస్తే ఆ తరువాత ఆ ప్రేమాభిమానాలు తిరిగి మనకు లభిస్తాయి అని చెప్పే చక్కని సందేశంతో రూపొందిన చిత్రం కీకీ అండ్ కోకో అని దర్శకుడు చెప్పారు.
తమిళసినిమా: డాన్‌న్స్‌మాస్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాబర్ట్ మాస్టర్ కథానాయకుడుగా అవతారం ఎత్తి ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా సెవల కాళ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా మీనాక్షి జైస్వాల్ నటిస్తున్నారు. వింగ్స్ పిక్చర్స్ పతాకంపై పాల్ సతీష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఆయన మాట్లాడుతూ తను 25 ఏళ్ల క్రితం సహాయ దర్శకుడిగా పనిచేయడానికి పలువురు దర్శకుల వద్ద ప్రయత్నాలు చేశానని అయితే ఎవరు తనను చేర్చుకోకపోవడంతో ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారన్నారు. ఆ అనుభవంతో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. ఇది మదురై నేపథ్యంలో సాగే వైవిచ్ఛపరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఊరును తన కబంధహస్తాల్లో పెట్టుకున్న ఒక ధనవంతుడు హీరో అన్నయ్యను అవమానించడంతో అతను ఏం చేశాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. రాబర్ట్ మాస్టర్‌కు జంటగా నటిస్తున్న మీనాక్షి జైస్వాల్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అన్ని అంశాలతో చిత్రం జనరంజకంగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను తొలి షెడ్యూల్ మదురైలో పూర్తి చేసినట్లు, త్వరలోనే తర్వాత షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు దర్శకుడు చెప్పారు.
ఇమ్మోర్టల్‌లో
కయదులోహర్,
జీవీ ప్రకాష్‌కుమార్
తమిళసినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇమ్మోర్టల్ చిత్రం ఒకటి. ఇందులో ఆయనకు జంటగా కయదు లోహర్ నటిస్తున్నారు. కింగ్‌స్టన్ చిత్రం తరువాత జీవీ ప్రకాష్‌కుమార్ నటిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా డ్రాగన్ చిత్రం తరువాత కయదులోహర్ నటిస్తున్న తమిళ చిత్రం ఇదే. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, అరుణ్ రాధాకష్ణన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. టీజర్‌ను చూస్తుంటే ఇది సైన్‌న్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథా చిత్రం అనిపిస్తోంది. ప్రేమతో పాటు అమాహ్య సంఘటనలు టీజర్‌లో చోటుచేసుకున్నాయి. ఏలియన్ లాంటి ఒక వింత మనిషి కూడా కనిపించడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. ఇమ్మోర్టల్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. జీవీ కథానాయకుడిగా మంచి హిట్ చూసి చాలా కాలమైంది. మరి ఈ చిత్రం ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి.
రాబర్ట్ మాస్టర్‌తో దర్శకుడు పాల్ సతీష్
జీవీకి జోడీగా కయదులోహర్
తమిళసినిమా: కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా వెలుగొందిన నా.రంజిత్ తనకంటూ ఒక ప్రత్యేక బాణీలో చిత్రాలను చేసుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అలా దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఈయన పారంపర్య సంగీతాన్ని ప్రోత్సహించే విధంగా నీలం పన్బాటుమయం పేరుతో సంస్థను ప్రారంభించి గత ఐదేళ్లుగా మార్గళిల్ మక్కళిసై పేరుతో మార్గళి నెలలో పారంపర్య సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంగీత వేదికపై అవకాశాలు దక్కని ప్రతిభావంతులైన సంగీత కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా 6వ మార్గళిల్ మక్కళిసై సంగీత కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి చైన్నెలో పచ్చైయప్ప కళాశాల వేదికగా మారింది. ఎంపీ కనిమొళి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే విధంగా శ్రీమతి ఆమ్‌స్ట్రాంగ్, దర్శకుడు అమీర్, వెట్రిమారన్, లోకేష్ కనకరాజ్, సతీష్, వినోద్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్, నివాస్ కె.ప్రసన్న, జాన్‌విజయ్, ముత్తుకుమార్, గాయకుడు సత్యన్, కళాకారులు పాల్గొన్నారు. కోలాహలంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, నా.రంజిత్ వేదికపై వెయ్ దరువెయ్ అన్నట్లు డప్పులు చేతబట్టి వాయించి ఆహూతులను అలరించారు. ఈ సంప్రదాయ సంగీత కార్యక్రమం మూడురోజుల పాటు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.
వెయ్ దరువెయ్!
వెయ్ దరువెయ్!
వెయ్ దరువెయ్!
వెయ్ దరువెయ్!


