53 ఏళ్ల వ్యక్తికి మోకాలికి అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: చైన్నె అడయార్ ఎంజీఎం హెల్త్ కేర్ మలర్ ఆస్పత్రిలో 53 ఏళ్ల వ్యక్తికి అరుదైన మోకాలి ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ టిష్యూ ట్రానన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఇది ఐదవ తరం ఆటోగ్రాఫ్ట్ కార్టిలేజ్ ట్రానన్స్‌ప్లాంట్ రోగులకు ఇంప్లాంట్లు, క్రచెస్ లేదా ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ అవసరం లేకుండా వెంటనే నడవడానికి సహాయపడుతుందని ప్రకటించారు. దీర్ఘకాలిక ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 53 ఏళ్ల రోగి ఈ అధునాతన చికిత్సనునిర్వహించామని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌నందకుమార్ సుందరం వివరించారు. శనివారం ఆయన ఈశస్త్ర చికిత్స గురించి మీడియాకు వివరించారు. ఈ అధునాతన మృదులాస్థి కణజాల మార్పిడి ముఖ్యంగా ఫోకల్ కాండ్రల్ లోపాలు, ఆస్టియోకాండ్రల్ గాయాలు, ప్రారంభ ఆస్టియో ఆర్థరైటిస్ మరియు కాండ్రోమలేసియా పాటెల్లా ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. చికిత్స చేయని పక్షంలో తీవ్రమైన కీళ్ల క్షీణతకు పరిస్థితి దారితీస్తుందన్నారు. చివరికి మొత్తం మోకాలి మార్పిడి అవసరం అవుతుందన్నారు. తాజాగా సహజ కీలును సంరక్షించడం ద్వారా దెబ్బతిన్న మృదులాస్థిని ముందుగానే పునరుద్ధరించడం ద్వారా, ఈ అధునాతన సాంకేతికత సురక్షితమైన, కీళ్ల సంరక్షణ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో పనిచేస్తూ, తీవ్ర ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా 15 సంవత్సరాలకు పైగా మోకాలి నొప్పి పరిమిత కదలికతో బాధ పడుతూ వచ్చిన వ్యక్తికి తాజాగా అందరి వలే సహజంగా నడిచే భాగ్యం ఈ విధానం ద్వార కలిగిందన్నారు.


