క్లుప్తంగా
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
వేలూరు: దివ్యాంగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు జిల్లా యూనియన్ పరిధిలోని డీడీ మోటూరు గ్రామ పంచాయతీలో మీతో స్టాలిన్ వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మీతో స్టాలిన్ వైద్యశిబిరాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం ఒక్కో గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసి రోగులకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. రోగుల నుంచి శస్త్ర చికిత్సల కోసం వచ్చే వినుతులను వెంటనే విచారణ జరిపి అవసరమైన రోగులకు శస్త్రచికిత్సకు సిఫారసు చేయాలన్నారు అదేవిధంగా దివ్యాంగులకు అవసరమైన సంక్షేమ పథకాలను అక్కడికక్కడే అర్హులైన వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎమ్మెల్యే అమ్ములు, యూనియన్ చైర్‌పర్సన్ చిత్ర, వైస్ చైర్మన్ లలిత, వైద్యాధికారులు పాల్గొన్నారు.
గోడ కూలి ఇద్దరు బాలికలు మృతి
అన్నానగర్: ఇంటి గేటు గోడ కూలి ఇద్దరు బాలికలు దుర్మరణం చెందారు. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపం కొంగళాపురం గ్రామానికి చెందిన రాజామణి భార్య రాజేశ్వరి పోలీసు అధికారిగా పనిచేస్తుంది. వీరికి కమలిక అనే 9 ఏళ్ల కూతురు ఉంది. ఈ స్థితిలో శనివారం ఉదయం, కమలిక, ఆమె బంధువు రమేష్ కుమార్తె రిషిక(4), రాజేశ్వరి ఇంటి తలుపు వద్ద ఇంటి గేటు పట్టుకుని ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా, గేటు గోడ కూలి కమలిక, రిషికలపై పడింది. వెంటనే స్థానికులు గురై శిథిలాలలో చిక్కుకున్న ఇద్దరు బాలికలు తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాలపై పడి రోదిస్తూ ఉండడం చూపరులను కలచివేసింది. విషయం తెలిసి శివకాశి పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష కోసం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్చాప్తు చేస్తున్నారు.
మట్టి పడి ఇద్దరు మృతి
తిరువొత్తియూరు: కొత్తగిరి సమీపంలో బావి తవ్వుతుండగా మట్టిపడి ఇద్దరు కూలీలు సజీవ సమాధి అయ్యారు. నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలో నైల్లె జిల్లాకు చెందిన వ్యక్తి లాడ్జి నిర్మిస్తున్నాడు. లాడ్జికి నీటి అవసరాల కోసం బావి తవ్వే పనులు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ఐదుగురు కూలీలు అక్కడ బావి తవ్వే పనిలో నిమగ్నమయ్యారు. వీరిలో ఇద్దరు కూలీలు 30 అడుగుల గుంతలోకి దిగి మరింత గుంత తవ్వుతున్నారు. ఆసమయంలో హఠాత్తుగా పైనుంచి మట్టి ఒక్కసారిగా బావిలో పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని కూలీల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. విచారణలో మృతి చెందిన కార్మికులు కొత్తగిరి డివిజన్ ప్రాంతానికి చెందిన పన్నీర్ సెల్వం ( 50), సతీష్ కుమార్ (40) అని తెలిసింది.
పదవి నుంచి బీజేపీ నేత తొలగింపు
కొరుక్కుపేట: పార్టీ హైకమాండ్ ఇచ్చిన డబ్బు పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా బీజేపీ కార్యవర్గ సభ్యుడి ఇంటిని ధ్వంసం చేసిన బీజేపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిని పదవి నుంచి తొలగించారు. తాంబరం సమీపంలోని అడలంతరాజపురంలోని ముడిచూర్‌లోని పీటీసీలో నివసించే ఓంశక్తి సెల్వమణి (50) శ్రీపెరంబుదూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ నిర్వాహకుడు. శ్రీపెరంబుదూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సెల్వమణి ఇంట్లోకి చొరబడి, ఇనుప రెండు కార్లను, బైక్‌ను ధ్వంసం చేశారు. ఇది చూసి ఓంశక్తి సెల్వమణి షాక్ అయ్యారు. సంఘటన జరిగిన వెంటనే సెల్వమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు అమర్‌నాథ్ (32) ను పార్టీ పదవి నుంచి తొలగించారు.
ఇళ్లు మంజూరు చేయాలని ఆందోళన
తిరువొత్తియూరు: సునామీలో ఇళ్లు కోల్పోయిన బాధితులు తమకు ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ పట్టణ గృహనిర్మాణ అభివృద్ధి బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. 2004లో చైన్నెలో సునామీ దెబ్బకు కాసిమేడు నాగూర్‌తోటం, అన్నానగర్ తీర ప్రాంతాలు సహా ఉత్తర చైన్నె తీర ప్రాంతానికి చెందిన 158 మంది తమ ఇళ్లను కోల్పోయారు. వారికి ఇప్పటి వరకు ఇళ్లు కేటాయించకపోవడంతో గత కొన్ని నెలలుగా వారు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో సునామీ ఉధృతికి 21వ స్మారక దినోత్సవం శుక్రవారం జరిగింది, సునామీలో ఇళ్లు కోల్పోయిన తమకు ఇప్పటివరకు ఇళ్లు ఇవ్వలేదని, తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ చైన్నె కాసిమేడు ఫిషింగ్ హార్బర్‌లోని మత్స్యశాఖ,రాయపురంలోని తమిళనాడు పట్టణ గృహనిర్మాణ బోర్డు కార్యాలయాలను ముట్టడించి ఆందోళన చేశారు. విషయం తెలిసి కాశిమేడు ఫిషింగ్ హార్బర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. అనంతరం వారు తిరువొత్తియూరు కార్గిల్ నగర్‌లోని పట్టణ గృహనిర్మాణ అభివృద్ధి బోర్డు నిర్మించిన ఇళ్లలోకి వెళ్లి స్థిరపడాలని అక్కడికి వెళ్లారు. విషయం తెలిసి సాతాంగాడు పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న పట్టణ గృహనిర్మాణ అభివృద్ధి బోర్డు అసిస్టెంట్ ఇంజినీర్, త్వరలో ఇళ్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


