ప్రస్తుతం సోషల్ మీడియా అంతా జిమ్ జిమ్ తార సాంగ్ జమానా నడుస్తోంది. ఈ పాట ఎంత వైరలైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్ణశాల మూవీలో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తూ ఫుల్ హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం రీల్స్‌తోనే నింపేస్తున్నారు. అంతలా ఈ సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు మేమేం తక్కువ కాదు అంటున్నారు సినీతారలు. ఈ సాంగ్‌ను మూవీ ప్రమోషన్లలో తెగ వాడేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్,అఖిల్ రాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తమ మూవీ క్రేజీ కల్యాణం ప్రమోషన్స్ కోసం జిమ్ జిమ్ తార సాంగ్‌ను వాడేశారు. ఈ పాటకు డ్యాన్స్ తమ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మామూలు వాడకం కాదు ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహించారు. ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.


