ప్రముఖ నటులు జయరామ్, సిమ్రాన్ తొలిసారి జంటగా ఓ ప్రొడెక్షన్ నెం4 ( వర్కింగ్ టైటిల్) తమిళ చిత్రంలో నటించనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ‘రాచ్చసి’, ‘కళువేతి మూర్కన్’ చిత్రాల దర్శకుడు ఎస్.వై. గౌతమ్‌రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాంకేతికంగా ఈ చిత్రానికి దీపక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అచ్చు రాజామణి సంగీతం, అరుల్ ఈ సిద్ధార్థ్ ఎడిటింగ్, మహేంద్రన్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు.
2002లో కమల్‌హాసన్, కేఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పంచతంత్రం’లో జయరామ్, సిమ్రాన్ కలిసి నటించారు. అయితే.. తొలిసారి ఈ సినిమాలో లీడ్ పెయిర్‌గా కనిపించనున్నారు. ‘వాళై’ ఫేమ్ పొన్వేల్, దేవికా సతీష్, భగవతి పెరుమాళ్ (బక్స్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా..
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. జెన్ జెడ్ తరం, 90ల తరానికి చెందిన వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధాలు, వాటి కారణంగా చోటుచేసుకునే ఆసక్తికర సంఘటనల చుట్టూ కథ సాగుతుందని సమాచారం.
సిమ్రాన్ చివరిగా 2025లో శశికుమార్‌తో కలిసి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’లో నటించారు. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి ‘ధర్మన్’లో నటిస్తున్నారు.


