నా టీనేజ్‌ ఫోటోలు అశ్లీల వెబ్‌సైట్‌లో కనిపించాయి: జాన్వీ కపూర్ | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: నాతో పాటు చెల్లి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేశారు:  జాన్వీ కపూర్

Published Fri, Sep 29 2023 6:14 PM

Janhvi Kapoor recalls finding her morphed pics In Websites - Sakshi

2018లో రొమాంటిక్ డ్రామా ధడక్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగా ఫేమ్ ఉన్నప్పటికీ తన గ్లామర్‌తోనూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మిలి మూవీతో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో అలరించింది. ఈ ఏడాదిలో వరుణ్ ధావన్ సరసన బవాల్‌లో నటించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరనస దేవరతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను స్టార్ కిడ్ కావడంతో ఫోటోలు, వీడియోలు నా జీవితంలో ఓ భాగమయ్యాయని తెలిపింది. అంతే కాకుండా ఈ డిజిటల్ యుగంలో తనపై తీవ్ర ప్రభావం చూపించాయని వెల్లడించింది. 

(ఇది చదవండి: 'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!)

జాన్వీ మాట్లాడుతూ..' కెమెరాలు ఎల్లప్పుడూ నా జీవితంలో ఒక భాగం. నా చిన్నతనం నుంచి నా సమ్మతితో లేక నా అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు నాతోపాటు నా సోదరి ఖుషీ కపూర్‌ల ఫోటోలు తీశారు. అయితే అవీ మేము యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసినవి. కానీ కొందరు తమ మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్స్‌లో పెట్టారు. నేటి డిజిటల్ యుగంలో నకిలీ చిత్రాల బెడద ఎక్కువైంది. కానీ ప్రజలు ఇలా మార్ఫింగ్ చేసిన చిత్రాలు చూసి అవి వాస్తవమైనవని నమ్ముతున్నారు. అది నాకు చాలా ఆందోళనకు గురిచేసింది.' అని అన్నారు. 

తనకు కేవలం 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఇంటర్నెట్‌లో నా ఫోటోలు కనిపించాయి. స్కూల్లో చదువుతున్నప్పుడే యాహూ హోమ్‌పేజీలో నా ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఒక రోజు  పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో తన క్లాస్‌మేట్స్ కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న నా ఫోటోలు చూశారు. అవీ చూసి తాను చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు వారంతా భావించారు. కానీ ఆసమయంలో నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని జాన్వీ పేర్కొంది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేశారని  తెలిపింది. ఇండస్ట్రీలో నేను కష్టపడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. స్కూల్‌ ఎప్పుడు మానేస్తున్నావు? అని ప్రశ్నించేవారని తెలిపింది. వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో.. నన్నెందుకు జడ్జ్‌ చేస్తున్నారో అర్థమయ్యేది కాదని దేవర భామ వెల్లడించింది. 

(ఇది చదవండి: 'హ్యాపీ బర్త్‌ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!)


 

Advertisement
 
Advertisement
 
Advertisement