'హ్యాపీ బర్త్‌ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్! | Sakshi
Sakshi News home page

Allu Arjun: భార్యకు బన్నీ బర్త్‌ డే విషెస్.. వీడియో వైరల్!

Published Fri, Sep 29 2023 2:09 PM

Icon Star Allu Arjun Shares A Video About Her Wife Sneha Reddy Birthday - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అల్లు అర్జున్- స్నేహారెడ్డి ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పుడు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉంటారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే సెప్టెంబర్‌ 29న తన భార్య స్నేహారెడ్డి బర్త్‌ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఓ వీడియో షేర్ చేశారు.  'హ్యాపీ బర్త్‌ డే క్యూటీ.. సన్‌సైన్‌ ఆఫ్‌ మై లైఫ్' అంటూ భార్యపై బన్నీ ప్రేమను చాటుకున్నారు. 

కాగా.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం చిత్రంలో కీలక పాత్రతో నటించిన అర్హ తొలిసారిగా స్క్రీన్‌పై నటిస్తోంది. కాగా.. అల్లు ‍అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వీరి కాంబో వచ్చిన పుష్ప పార్ట్-1 ఇండస్ట్రీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement